ప్ర‌భాస్ మాయలో క‌ర‌ణ్ జోహార్.. 

మూడేళ్ళ కింది వ‌ర‌కు ప్ర‌భాస్ తెలుగు హీరో. కానీ ఇప్పుడు ఆయ‌న నేష‌న‌ల్ ప్రాప‌ర్టీ. బాహుబ‌లి పుణ్య‌మా అని మ‌నోడి క‌టౌట్ కు బాలీవుడ్ లో కూడా బాగా డిమాండ్ పెరిగిపోయింది. దాంతో ఇప్పుడు ప్ర‌భాస్ ను తెలుగు హీరో అనాలో.. బాలీవుడ్ స్టార్ అనాలో అర్థం కావ‌డం లేదు. ప‌రిస్థితి చూస్తుంటే ఆయ‌న్ని తెలుగు ఇండ‌స్ట్రీ మ‌రిచిపోవాల్సిందేనా అనిపిస్తుంది. అదేంటి అంత పెద్ద మాట‌లెందుకు అనుకుంటున్నారా..? ఏమో మ‌రి ఇప్పుడు ప్ర‌భాస్ ప్లాన్స్ చూస్తుంటే అలాగే ఉన్నాయి.
ఇప్ప‌టికే ఈ హీరో కోసం ముంబైలో పెద్ద ప్లాన్ న‌డుస్తుంది. ఈయ‌న్ని ఎలాగైనా బుట్ట‌లో ప‌డేయాల‌ని పార్టీలు కూడా ఇస్తున్నారు. ప్ర‌భాస్ కూడా బాలీవుడ్ కు రెగ్యుల‌ర్ గా ట‌చ్ లోకి వెళ్తున్నాడు. అంతేకాదు.. ప్ర‌భాస్ ప్ర‌త్యేకంగా హిందీ కూడా నేర్చుకుంటున్నాడు ఇప్పుడు. సాహోకు అన్నీ కుదిర్తే తానే డ‌బ్బింగ్ చెప్పుకోవాల‌ని చూస్తున్నాడు.
ఆ మ‌ధ్య ముంబైలో జ‌రిగిన క‌ర‌ణ్ జోహార్ పార్టీకి వెళ్లాడు ప్ర‌భాస్. అక్క‌డ ప్ర‌భాస్ తో పాటు టాలీవుడ్ నుంచి వెళ్లింది ఒక్క రానా మాత్ర‌మే. రానా అంటే ఎప్ప‌ట్నుంచో క‌ర‌ణ్ కు స్నేహితుడు కాబ‌ట్టి వెళ్లాడు. మ‌రి ప్ర‌భాస్ ఎందుకు వెళ్లిన‌ట్లు..? ఎందుకంటే ప్ర‌భాస్ ను బాలీవుడ్ కు ప‌రిచ‌యం చేస్తున్న‌ది క‌ర‌ణ్ జోహార్ అనే వార్త‌లు వినిపిస్తున్నాయి కాబ‌ట్టి. అంతేకాదు ఈ పార్టీ వెన‌క ఉన్న ర‌హ‌స్యం కూడా ఇదే అని తెలుస్తోంది. ఎలాగైనా సాహో త‌ర్వాత ప్ర‌భాస్ తో డైరెక్ట్ గా ఓ బాలీవుడ్ సినిమా చేయాల‌ని చూస్తున్నాడు క‌ర‌ణ్ జోహార్. ఇప్ప‌టికే ప్ర‌భాస్ తో 150 కోట్ల డీల్ కూడా క‌ర‌ణ్ మాట్లాడేసాడ‌నేది ప్ర‌చారంలో ఉన్న వార్త‌. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. ప్ర‌భాస్ ను చివ‌రికి ఏం చేస్తారో..?