ప్ర‌పంచంపై ప్ర‌భాస్ దండ‌యాత్ర‌

Last Updated on by

బాహుబ‌లి సిరీస్ అసాధార‌ణ‌ విజ‌యంతో ప్ర‌భాస్ అజేయ‌మైన జైత్ర యాత్ర కొన‌సాగుతోంది. అతడు న‌టించే సినిమాల‌కు చాలా ముందు నుంచే డిమాండ్ ఏర్ప‌డుతోంది. ఆ క్ర‌మంలోనే సాహో బిజినెస్ అప్పుడే ఓపెన్ అయిపోవ‌డం, హిందీ డ‌బ్బింగు హ‌క్కుల్ని టీ -సిరీస్ ఛేజిక్కించుకోవ‌డంపైనా.. ఫిలింవ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఓవైపు సాహో బిజినెస్ గురించి మాటా మంతీ సాగుతుండ‌గానే, మ‌రోవైపు బాహుబ‌లి 2 ఈ శుక్ర‌వారం( మే 4న‌) చైనాలో రికార్డు స్థాయిలో 7000 స్క్రీన్ల‌లో రిలీజ‌వుతోంది. రిలీజ్ ముందే.. 250కె డాల‌ర్లు సంపాదించింద‌న్న రిపోర్ట్ అందింది. అడ్వాన్స్ బుకింగుల్లో ఇప్ప‌టివ‌ర‌కూ చైనాలో రిలీజైన భార‌తీయ సినిమాల్లోనే నంబ‌ర్ -1 గా నిలిచింద‌న్న టాక్ వినిపిస్తోంది. ఇక తొలిరోజు, మ‌లిరోజు, మూడో రోజు .. అంటూ రికార్డులు సృష్టిస్తుందా? అన్న అంచనాలు ఏర్ప‌డ్డాయి.
అమీర్‌ఖాన్ దంగ‌ల్‌, సీక్రెట్ సూపర్‌స్టార్‌, స‌ల్మాన్ భ‌జ‌రంగి భాయిజాన్‌, ఇర్ఫాన్ హిందీ మీడియం వంటి చిత్రాలు చైనాలో భారీగా స‌క్సెస‌య్యాయి. ఇప్పుడు ఆ క్రెడిట్‌ను బాహుబ‌లి బృందం ద‌క్కించుకునేందుకు శ‌త‌ధా ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్ప‌టికే జ‌పాన్‌లో సాధించిన విజ‌యం ఈ టీమ్‌కి కొత్త ఉత్సాహం నింప‌డంతో ఇక దంగ‌ల్ రికార్డులు  ఓవ‌రాల్ గా బ్రేక్ చేసేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం చైనాలో ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారుట‌. వేరొక వైపు `సాహో` త‌ర‌వాత రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వ ంలో న‌టించ‌నున్న‌ సినిమాకి ఆస‌క్తిక‌ర బుజ్ ఏర్ప‌డింద‌ని తెలుస్తోంది. అలాగే ఆ చిత్రాన్ని పూర్తిగా యూర‌ఫ్‌లో తెర‌కెక్కించ‌నున్నారు. ప్ర‌భాస్ న‌టిస్తున్న 20వ సినిమాగా ఈ చిత్రంపై క్రేజు పెంచే స‌న్నాహ‌కాల్లోనూ యూనిట్ ఉంద‌ని తెలుస్తోంది. … ప్ర‌భాస్‌తో నాలుగు దేశాల పేర్లు ఇప్ప‌టికిప్పుడు ముడిప‌డి ఉన్నాయి. ఒక‌టి ప్ర‌స్తుతం సాహో లొకేష‌న్ – అబూద‌బీ.. త్వ‌ర‌లో సెట్స్‌కెళ్ల‌నున్న 20వ సినిమా యూర‌ఫ్ షెడ్యూల్‌.. అలానే బాహుబ‌లి 2 చైనా రిలీజ్.. ఇదంతా దండ‌యాత్ర అనే భావించాలి. మొత్తానికి ప్ర‌భాస్ ప్ర‌పంచం మొత్తం చుట్టేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఇండియా, అమెరికా, బ్రిట‌న్‌, ఆస్ట్రేలియా, జ‌పాన్‌, అబూద‌బీ, చైనా, యూర‌ఫ్ వంటి దేశాల‌పై దండ‌యాత్ర చేస్తున్నాడ‌నే చెప్పాలి. ఈ యాత్ర ఇంకా ఇంకా ఇత‌ర దేశాల‌కు పాకాల‌ని ఆకాంక్షిద్దాం.

User Comments