ప్రభాస్ సాహో కథ గురించి షాకింగ్ అప్డేట్స్

 

టాలీవుడ్ నుంచి దేశం మొత్తం మెచ్చే సూపర్ హీరోగా మారిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ‘సాహో’ అంటూ మరోసారి దేశం మొత్తాన్ని అలరించడానికి బాగానే కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సాహో టీజర్ తో పాటు కొన్ని అప్డేట్స్ కూడా బయటకొచ్చి.. వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే సినిమాపై అప్పుడే అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడేమో అంతకుమించి అనేలా సాహో కథకు సంబంధించి కొన్ని షాకింగ్ అప్డేట్స్ బయటకు రావడం ఆలస్యం హాట్ టాపిక్ కు తెర లేచింది.
ఆ స్టోరీలోకి వెళితే, ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో సాహో సినిమాకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ సందర్బంగా షూటింగ్ లో బ్రిటీష్ జాతీయ జెండా ఒకటి నిటారుగా ఎగురుతూ ఉంటే.. మధ్యలో కొన్ని వందల గుర్రాలతో కూడిన యుద్ధ సన్నివేశాలను షూట్ చేస్తున్నారని తెలియడం ఇప్పుడు షాక్ ఇస్తోంది. అదీకాకుండా పోలో ఆటపై కూడా కొన్ని సీన్స్ ను తీస్తున్నారని తెలియడం విశేషం. దీంతో ఇప్పుడు అక్కడున్న ఆ సెటప్ అంతా చూస్తే.. ఈ సినిమాలో దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు జరిగిన కొంత కథ ఉందని అర్థమవుతుందని ఇన్నర్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోవైపు, సాహో టీజర్ లో స్టైలిష్ లుక్ తో కూడిన టెక్నికల్ వండర్ ను చూపించడంతో.. ఈ సినిమా అయితే పునర్జన్మ నేపథ్యంలో ఉంటుందని.. లేదంటే టైమ్ ట్రావెల్ తరహా కథతో కూడుకుని ఉంటుందని, మొత్తంగా ప్రభాస్ ఇందులో ద్విపాత్రాభినయం చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో, ఆ షూటింగ్ లో సెట్ మరియు ఆ బ్రిటిష్ కాలం నాటి వాతావరణం ఏంటో తెలియాలంటే.. ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే. ఏదిఏమైనా, ఇప్పటికే అంచనాలతో ఎక్కడో ఉన్న సాహో సినిమా ఇప్పుడు ఇలాంటి షాకింగ్ అప్డేట్స్ ఇస్తే రిలీజ్ వరకు వెయిట్ చేయడం కష్టమే. మరి ఊహలకు అందకుండా ఉన్న ఈ సినిమా చివరకు ఆ రేంజ్ లో అలరిస్తుందో లేదో చూడాలి.