ప్రదీప్ ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రానా

పాపులర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ అనే రొమాంటిక్ కామెడీ మూవీతో హీరోగా మారుతున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర ‘ఆర్య 2’, ‘నేనొక్కడినే’ సినిమాలకు పనిచేసిన మున్నా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆయనే ఈ సినిమాకు రచన కూడా చేస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ లను శనివారం ‘బాహుబలి’ స్టార్ రానా దగ్గుబాటి ఆవిష్కరించారు. రానాకు ఈ పోస్టర్ల కాన్సెప్టు, సంగీతం నచ్చి ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ బృందానికి శుభాకాంక్షలు తెలపడమే కాకుండా, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఫస్ట్ లుక్ పోస్టరులో పల్లెటూరి వేషంలో ఉన్న ప్రదీప్, సినిమాలో తన ప్రేయసిగా నటిస్తోన్న అమృత అయ్యర్ తో పాటు కులాసాగా కనిపిస్తున్నాడు. ఇద్దరి ముఖాల్లోనూ ఉల్లాసం తాండవిస్తోంది. సూర్యోదయం, జలపాతాలు, పక్షులు, చెట్లతో బ్యాగ్రౌండ్ ఒక అందమైన పెయింటింగ్ ను తలపిస్తోంది.

టైటిల్ డిజైన్ కూడా ఆసక్తికరంగా ఉంది. బాణం విసురుతున్న మన్మథుడు, గులాబీ, లవ్ లెటర్, తాళం వేసిన హృదయం వంటి వాటితో ఆ టైటిల్ ను రూపకల్పన చేశారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించనున్నది.
ఎస్.వి. ప్రొడక్షన్స్ పతాకంపై సక్సెస్ ఫుల్ కన్నడ నిర్మాత ఎస్.వి. బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి పేరుపొందిన నటీనటులు, టెక్నీషియన్లు పనిచేస్తున్నారు.
దాశరథి శివేంద్ర సినిమాటోగ్రాఫరుగా పనిచేస్తున్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు.

తారాగణం:
ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్, శివన్నారాయణ, హేమ, పోసాని కృష్ణమురళి, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, భద్రం, జబర్దస్త్ మహేష్.

సాంకేతిక వర్గం:
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
సింగర్స్: సిద్ శ్రీరామ్, రాహుల్ సిప్లిగంజ్, అనురాగ్ కులకర్ణి, ధనంజయ్, సునీత, మోహన భోగరాజు, మధుప్రియ
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్
కొరియోగ్రఫీ: శేఖర్, యష్
నిర్మాత: ఎస్.వి. బాబు
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: మున్నా
బ్యానర్: ఎస్.వి. ప్రొడక్షన్స్