2014లో బికినీ లుక్ ఇది

Last Updated on by

ముంబై బ్యూటీ ప్ర‌గ్య జైశ్వాల్ 2014లో ఎలా ఉండేది? .. అంటే ఇదిగో ఈ ఫోటోనే స‌మాధానం. మోడ‌లింగ్ డేస్ లో ప్ర‌గ్య విలాప‌మిది. అప్ప‌ట్లో బికినీ లుక్ కోసం ప్ర‌గ్య ఇదిగో ఇలా ఫోజులిచ్చింది. ఇదే విష‌యాన్ని ప్ర‌గ్య సామాజిక మాధ్య‌మాల్లో ఈ ఫోటోని షేర్ చేసి రివీల్ చేసింది.
2014లో ఓ ఫోటో ఇది.  ఫోన్ లో వెతుకుతుంటే క‌నిపించింది. మున్నా ఫోటోషూట్.. ప్ర‌తాప్ సిమ‌న్ స్టైలింగ్ చేశార‌ని మోడ‌లింగ్ రోజుల్ని ఓమారు స్ఫుర‌ణ‌కు తెచ్చుకుంది. ఇక ప్ర‌గ్య కెరీర్ ప‌రంగా రేసులో వెన‌క‌బ‌డిన సంగ‌తి తెలిసిందే. కంచె త‌ర్వాత కేవ‌లం ఈ ఐదారేళ్ల జ‌ర్నీలో నటించింది ఐదారు సినిమాలు మాత్ర‌మే. ప్ర‌స్తుతం సైరా- న‌ర‌సింహారెడ్డి చిత్రంలో ఓ అతిధి పాత్ర‌లో త‌ళుక్కుమంటుంద‌ని తెలుస్తోంది.

Related Posts