బ‌యోపిక్‌లో కీరోల్ లీక్‌

Last Updated on by

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ దాదాపు 100కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న సినిమా ఎన్టీఆర్‌. న‌వ‌ర‌స‌న‌ట‌సార్వ‌భౌముడు, అన్న‌గారు నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత‌క‌థ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో ప‌లువురు సీనియ‌ర్ న‌టీన‌టులు కీల‌క పాత్ర‌లు పోషించనున్నారు. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు క్రిష్ ఈ సినిమాని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కించేందుకు అన్ని అస్త్రాల్ని సిద్ధం చేశారు. ఇటీవ‌లే ఈ చిత్రంలో నంద‌మూరి న‌ట‌వార‌సుడు మోక్ష‌జ్ఞ నూనూగు మీసాల బాలకుడైన‌ ఎన్టీఆర్ పాత్ర‌లో న‌టిస్తాడ‌ని ప్ర‌చార‌మైంది.

తాజాగా మ‌రోపాత్ర గురించిన ఆస‌క్తిక‌ర వివ‌రాలు సామాజిక మాధ్య‌మాల్లో అధికారికంగా రిలీజ‌వ్వ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ఈ బ‌యోపిక్‌లో విల‌క్ష‌ణ‌న‌టుడు ప్ర‌కాష్‌రాజ్ విజ‌య‌వాహిని స్టూడియోస్ అధినేత, లెజెండ‌రీ ప్రొడ్యూస‌ర్‌ నాగిరెడ్డి పాత్ర‌లో న‌టిస్తున్నారు. త‌న గెట‌ప్ ఎలా ఉంటుందో త‌న‌కు తానుగానే సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌కాష్‌రాజ్ రివీల్ చేశారు. అచ్చం నాగిరెడ్డి గారిలానే ఆ క‌ళ్ల‌ద్దాలు ధ‌రించిన ప్ర‌కాష్‌రాజ్ .. మ‌రోసారి లెజెండ్ పాత్ర‌తో త‌న విల‌క్ష‌ణ‌త‌ను చాటుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

User Comments