టాలీవుడ్ లో తెలుగమ్మాయిల హవా తగ్గిపోయిందన్న ఆవేదన సీనియర్లలో ఉంది. అయితే ఇటీవల నెమ్మదిగా ఈ పరిణామం మారుతోంది. ఫ్లో ఇటీవల అంతకంతకు పెరుగుతోంది. ట్రెండ్ మారుతుండంతో ఉన్నంతలో తెలుగు గాళ్స్ కి అవకాశాలు బాగానే వస్తున్నాయి. పరిమిత బడ్జెట్ సినిమాలకు ఉత్తరాది భామలకన్నా తెలుగు అందాలే ఉత్తమం అని నమ్మే దర్శక, నిర్మాతలు ఎంకరేజ్ చేస్తున్నారు. భవిష్యత్ చేప్పలేం కానీ ఒకప్పటితో పొలిస్తే ఇప్పుడు కాస్త బెటరనే అనిపిస్తోంది. ఈషారెబ్బా, రీతువర్మ, ప్రియాంక జవాల్కర్ పెద్ద స్టార్ హీరోయిన్లు కానప్పటికీ అవకాశం అనే వేదిక దొరికింది కాబట్టి నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ కి ప్రకాశం జిల్లా బ్యూటీ ఎంట్రీ ఇస్తోంది. ఆమె హర్షిత చౌదరి. తోలు బొమ్మలాట అనే చిత్రంతో లాంచ్ అవుతోంది.
రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో, విశ్వంత్, వెన్నెల కిషోర్, దేవి ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తోన్న చిత్రమిది. త్వరలోనే సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రకాశం బ్యూటీ పరిశ్రలో తన హద్దుల గురించి చెప్పి హైలైట్ అయింది. బోల్డ్ పాత్రల్లో కనిపించే అవకాశం లేదు. నేను పదహారణాల తెలుగు అమ్మాయిని. డ్రెస్సింగ్ విషయంలో కొన్ని పరిమితులున్నాయి. బోర్డర్ దాటే ప్రశక్తే లేదు. అయినా సినిమా అనేది ఎంటర్ టైన్ మెంట్. అందులో గ్లామర్ అవసరమే. కానీ ఆ అందం హద్దు మీరకూడదంది. సినిమాల్లోకి రాకముందు కొన్ని యాడ్స్ చేసా. ఆ అనుభవంతోనే తోలుబొమ్మలాటలో అవకాశం వచ్చింది.
ఇంట్లో సినిమాల గురించి చెబితే అమ్మనాన్న వద్దన్నారు. కానీ నా ఆసక్తి చూసి రాజీ పడ్డారు. వాళ్ల గౌరవాన్ని కాపాడాలి. చేసే పాత్రలన్నీ నా తల్లిదండ్రులతో కలిసి చూసేలా ఉండాలి. పుట్టింది ప్రకాశం జిల్లా అయినా…పెరిగిందంతా హైదరాబాద్ లోనే. మాస్ కమ్యూనికేషన్స్ చదువుతున్నాని తెలిపింది. మరి ఇన్ని కండీషన్లు? హీరోయిన్ల మధ్య కాంపిటీషన్ మధ్య ప్రకాశం పిల్ల ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి.