ప్ర‌కాష్‌రాజ్ రియ‌ల్ విల‌న్‌?

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్‌రాజ్ క్ర‌మ‌శిక్ష‌ణారాహిత్యం, ఆయ‌న పెట్టే తిప్ప‌ల గురించి ఇప్ప‌టికే బోలెడంత ప్ర‌చారం సాగింది. ఇదివ‌ర‌కూ శ్రీ‌నువైట్ల శిష్యుడితో గొడ‌వ‌ప‌డి ఆగ‌డు చిత్రం నుంచి త‌ప్పుకున్నాడు. అంత‌కుముందు ప‌లువురు అసిస్టెంట్ల‌తో అత‌డు గొడ‌వ ప‌డ్డ సంద‌ర్భాల‌పైనా ప్ర‌చారం సాగింది.

అదంతా అటుంచితే ఇటీవ‌ల మ‌రోసారి ఆ త‌ర‌హా రూమ‌ర్ ఒక‌టి టాలీవుడ్‌లో షికార్ చేస్తోంది. ప్ర‌కాష్‌రాజ్ ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ప‌లు క్రేజీ ప్రాజెక్టుల్లో న‌టిస్తున్నారు. రామ్‌- అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంటగా న‌టిస్తున్న `హ‌లో గురూ ప్రేమ‌కోస‌మే` చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ప్ర‌కాష్‌రాజ్ అనుప‌మ‌తో గొడ‌వ పెట్టుకున్నార‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌చార‌మైంది. అయితే దానిని అనుప‌మ ఖండించ‌డం చ‌ర్చ‌కొచ్చింది. తాజాగా ఈ మూవీ లొకేష‌న్‌లో సినిమాటోగ్రాఫ‌ర్ విజ‌య్‌.కె.చ‌క్ర‌వ‌ర్తితోనూ ప్ర‌కాష్‌రాజ్ గొడ‌వ పెట్టుకున్నార‌ని చెబుతున్నారు. త‌న‌పై క్లోజ్ షాట్ మాత్ర‌మే చిత్రీక‌రించి లాంగ్ షాట్‌కి డూప్‌ని ఉప‌యోగించాల‌ని ప్ర‌కాష్‌రాజ్ కోరారుట‌. అందుకు విజ‌య్‌.కె. చ‌క్ర‌వ‌ర్తి స‌సేమిరా అన‌డంతో ప్ర‌కాష్‌రాజ్‌తో ఘర్ష‌ణ త‌ప్ప‌లేద‌ని, కొన్ని నిమిషాల పాటు ఆర్గ్యుమెంట్ సాగింద‌ని స‌న్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి ఈ వివాదంపై ఫిలింన‌గ‌ర్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.