అయ్యో పాపం ప్ర‌ణీత‌!

Last Updated on by

కొంద‌రికి అన్నీ ఉండీ.. అల్లుడి నోట్లో శ‌ని! అన్న‌ట్టే ఉంటుంది. పాపం చేప‌క‌ళ్ల ప్ర‌ణీత ప‌రిస్థితి కూడా ఇదే. అందానికి అందం, న‌ట‌న‌, క్లాసిక్ నృత్యంలో అభినివేశం, క‌వ్వించే శ‌రీర సౌష్ట‌వం అన్నీ ఉండీ ఈ అమ్మ‌డు ఎందుక‌నో రేసులో వెన‌క‌బ‌డిపోయింది. ప్ర‌స్తుతానికి ప్ర‌ణీత తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా న‌గ‌రంలో క‌నిపిస్తే క‌చ్ఛితంగా అక్క‌డ ఏదైనా రిబ్బ‌ను క‌టింగ్ కార్య‌క్ర‌మం అయితే త‌ప్ప పెద్దంత‌గా క‌నిపించ‌డం లేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ అత్తారింటికి దారేది లాంటి ఇండ‌స్ట్రీ హిట్ సినిమాలో న‌టించీ ఈ అమ్మ‌డు ఎందుక‌నో కెరీర్ ప‌రంగా బిజీ కాలేక‌పోయింది.

ప్ర‌స్తుతం రామ్ – అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన `హ‌లో గురు ప్రేమ‌కోస‌మే` చిత్రంలో ప్ర‌ణీత ఓ కీల‌క పాత్ర పోషించింది. అయితే త‌న పాత్ర ప‌రిధి ఎంత‌? అని అడిగితే రామ్ స్వ‌యంగా డీటెయిల్స్ అందించారు. “ప్రణీత ఓ గెస్ట్ రోల్ చేసింది. త‌ను ఉంది క‌దా.. అని ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు. ఈసినిమా ప్రధానంగా నాకు, అనుపమ, ప్రకాష్ రాజ్ మధ్య సాగుతుంది. ఈ ముగ్గరి పాత్రలు సినిమాకు చాలా అవసరం“ అని చెప్పాడు. దీనిని బ‌ట్టి ప్ర‌ణీత మ‌ళ్లీ అంత‌గా ప్రాధాన్య‌త లేని పాత్ర‌లోనే న‌టించింద‌ని అర్థ‌మ‌వుతోంది. మ‌ధ్య మ‌ధ్య‌లో చిన్న గ్లింప్స్ ఇచ్చి అలా వెళ్లిపోతుంద‌న్న‌మాట‌.

User Comments