ఎన్టీఆర్ తో ఫేక్… మ‌హేష్ తో ఫిక్స్

`కేజీఎఫ్` డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ పేరిప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. ప్ర‌శాంత్ త‌దుప‌రి సినిమాని మ‌హేష్ తో ప్లాన్ చేస్తున్నాడ‌ని కొంద‌రంటే.. కాదు కాదు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో చేస్తున్నాడ‌ని నాలుగు  రోజుల నుంచే సోష‌ల్ మీడియాలో ఒక‌టే ర‌చ్చ‌. తాజాగా ప్ర‌శాంత్ నీల్ , మ‌హేష్ కే ఫిక్స్ అయిన‌ట్లు ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలే ధృవీక‌రించాయి. అలాగే సౌత్ లాంగ్వేజెస్  అన్నింటిలోనే  భారీ బ‌డ్జెట్ తో మ‌హేష్ బాబు ఎంబీ ప్రొడ‌క్ష‌న్స్ లోనే  చిత్రం ఉంటుంద‌ని చెబుతున్నారు. న‌మ్ర‌త‌ను క‌లిసి ప్ర‌శాంత్ స్టోరీ లైన్ వినిపించ‌డం, న‌చ్చ‌డంతో  స్క్రిప్టు డెవ‌ల‌న్ చేయ‌మ‌ని చెప్ప‌డం నిజ‌మేన‌ని మ‌హేష్ స‌న్నిహిత వ‌ర్గాలు ధృవీక‌రించాయి. దీంతో 2021లో ప్ర‌శాంత్-మ‌హేష్ కాంబినేష‌న్ సెట్స్ కెళ్ల‌డం ఖాయ‌మేనని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం మ‌హేష్..  వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కత్వంలో `మ‌హ‌ర్షి`లో న‌టిస్తున్నాడు. టాకీ పార్టు ఈనెల మిడ్ క‌ల్లా పూర్త‌వ్వ‌నుంది. అటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్ని ప‌నులు పూర్తి చేసి మేలో చిత్రాన్ని విడుద‌ల‌ చేయ‌నున్నారు. సుకుమార్ తో  సినిమ క్యాన్సిల్ అయిన నేప‌థ్యంలో ఈ గ్యాప్ లో అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడు సందీప్ వంగ‌తో చేస్తాడ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఇప్ప‌టికే స్క్రిప్టు లాక్ అయిన‌ట్లు  వినిపిస్తోంది. అయితే ఆక‌థ‌కు ఇంకా మెరుగులు దిద్దాల్సి ఉంది. అందుకోసం ఆరు నెల‌లు స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఈ లోపు ప్ర‌శాంత్ నీల్ కూడా ఫ్రీ అయిపోతాడు.