తొలి భాగానికి ధీటుగా `ప్రేమ కథా చిత్రమ్-2`

Last Updated on by

ప్రేమ కథా చిత్రమ్ సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ చిత్రానికి సీక్వెల్ ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2 తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. జక్కన్న తో కమర్షియల్ సక్సస్ ని సాధించిన ఆర్.పి.ఏ క్రియోషన్స్ బ్యానర్ లో ప్రోడక్షన్ నెం-3 గా తెరకెక్కుతున్న చిత్రం ప్రేమకథాచిత్రమ్2 . ఈచిత్రంతో హరి కిషన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. సుమంత్ అశ్విన్,సిద్ధి ఇజ్ఞాని జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న ‘ప్రేమ కథా చిత్రం 2. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఏప్రిల్ 6న ఈ చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. సూపర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మొదటి పార్ట్‌కి ధీటుగా వస్తుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సప్తగిరి చేతుల మీదగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ… ఈ సినిమా చాలా కష్టపడి తీశాం. ఫస్ట్‌పార్ట్‌కి ఏమాత్రం తీసిపోకుండా దానికి ధీటుగా ఉండేలా చేశాం. అందుకు ప్రొడ్యూసర్‌గారు తన పూర్తి సహకారాన్ని అందించారు. ఈ చిత్రంలోని పాటలు కూడా చాలా బాగా కుదిరాయి. ఇందులోని నటీనటులందరూ చాలా బాగా చేశారు. టీమ్ అందరం మంచి కాన్ఫిడెంట్‌గా ఉన్నాము అన్నారు. హీరో మాట్లాడుతూ… ఈ చిత్రంలో అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ చిత్రంలో సప్తగిరిగారు లేరని చాలామంది అడిగారు. ఆయన ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది. అందరికంటే ముఖ్యంగా డిఓపిగారితో వర్క్ చెయ్యడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ప్రతి ఫ్రేమ్ చాలా బాగా చూపించారు. సుదర్శన్‌గారు బాగా సపోర్ట్ చేశారు. హరిగారు కూడా క్లయిమాక్స్ సీన్స్ చాలా మెచ్యూర్డ్‌గా తెరకెక్కించారు అన్నారు. నిర్మాత‌ సుదర్శన్ మాట్లాడుతూ… కంటెంట్‌ని నమ్మి ఈ చిత్రం తియ్యడానికి ముందుకొచ్చాను. హరి డెబ్యూ డైరెక్టర్ కాని చాలా బాగా చిత్రీకరించారు. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. సుమంత్ అశ్విన్ గతంలో చేసిన మూవీస్ కంటే ఈ మూవీ మంచి హిట్‌ని అందిస్తుంది. తన కెరీర్‌కి ఎంతో ఉపయోగపడుతుంది. ఏప్రిల్ 6న ఈ చిత్రం విడుదలవుతుంది అని అన్నారు.

User Comments