`ప్రేమ‌మ్` బ్యూటీ ప్ర‌ద‌క్షిణం

Last Updated on by

ప్రేమ‌మ్ సినిమాతో అటు మ‌ల‌యాళం, ఇటు తెలుగులో అసాధార‌ణ పాపులారిటీ తెచ్చుకుంది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. ఈ అమ్మ‌డి క్యూట్ లుక్స్‌కి తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. యూత్‌లో అనుప‌మ‌కు ఉన్న ఫాలోయింగ్ అసాధార‌ణం. అ..ఆ, ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ సినిమాల్లో అద్భుత‌మైన అభిన‌యంతో మెప్పించింది. అటుపై టాలీవుడ్‌లో కెరీర్ ప‌రంగా క్ష‌ణం తీరిక లేనంత బిజీ అయిపోయింది. ఇప్ప‌టికే అర‌డ‌జ‌ను సినిమాల్లో న‌టించేసిన అనుప‌మ మాతృప‌రిశ్ర‌మ మ‌ల‌యాళంలో కేవ‌లం రెండే రెండు సినిమాలు చేసింది. త‌మిళంలో ధ‌నుష్ స‌ర‌స‌న కోడి అనే భారీ చిత్రంలో న‌టించింది. అక్క‌డ ప‌లు చిత్రాల‌కు సంత‌కాలు చేసేందుకు రెడీ అవుతోంది.

ఈలోగానే ఊహించ‌ని రీతిలో క‌న్న‌డ సినీరంగంలోనూ ఈ భామ ప్ర‌వేశించింది. అక్క‌డ ఓ సినిమాకి సంత‌కం చేసేసింది. అంటే చాలా త‌క్కువ స‌మ‌యంలో ద‌క్షిణాది అన్ని భాష‌ల్లోనూ ఈ భామ‌ ప్ర‌ద‌క్షిణం చేసేస్తోంది. నాలుగు ప్ర‌ధాన భాష‌ల్లో సినిమాలు చేస్తూ స‌త్తా చాటుతోంది. సాయిధ‌ర‌మ్ స‌ర‌స‌న‌ అనుప‌మ న‌టించిన `తేజ్ ఐ ల‌వ్ యు` జూలై 6న‌ రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

User Comments