కొంప ముంచిన శ్రీ‌దేవి

Last Updated on by

శ్రీ‌దేవి కొంప ముంచింది. వింక్ గాళ్ ప్రియా ప్ర‌కాష్ వారియర్ వివాదాల్లోకి వ‌చ్చేందుకు కార‌ణ‌మైంది. అదెలా అంటే.. ప్రియా ప్ర‌కాష్ న‌టించిన శ్రీ‌దేవి బంగ్లా తాజా టీజ‌ర్ ఈ వివాదాన్ని మోసుకొచ్చింది. ఈ టీజ‌ర్ లో శ్రీ‌దేవి అనుమానాస్ప‌ద మృతిని చిత్రీక‌రించార‌న్న అనుమానాలు ముసురుకునేలా టీజ‌ర్ ని రూపొందించి రిలీజ్ చేశారు. ఈ టీజ‌ర్ వీక్షించిన బోనీ క‌పూర్ అత‌హ‌శుడై, చిత్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్ర‌శాంత్ మాంబుల్లి, కథానాయిక ప్రియా ప్ర‌కాష్ కి నోటీసులు జారీ చేశారు. అయితే ఇది శ్రీదేవి జీవితానికి సంబంధించిన సినిమా కాద‌ని ద‌ర్శ‌కుడు వివ‌ర‌ణ ఇచ్చారు. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ మాట్లాడుతూ-“ ఈ నోటీసులను ఎదుర్కొంటాం. శ్రీదేవి అన్నది సాధారణంగా అమ్మాయిలు పెట్టుకునే పేరు. అతిలోక సుంద‌రి శ్రీ‌దేవితో ఏమాత్రం సంబంధం లేని సినిమా ఇది“ అని అంటున్నారు.

ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ కథ అని, ఏదేమైనా కేసుని ధైర్యంగా ఎదుర్కొంటామని ఆయ‌న అన్నారు.ప్రియా ప్రకాష్ కూడా మీడియాతో ఈ విషయం గురించి మాట్లాడుతూ-“ఇది శ్రీదేవి సినిమానా కాదా అని తెలుసుకోవాలంటే ముందు సినిమా చూడాలి. ఇందులో నేను శ్రీదేవి అనే సూపర్ స్టార్ పాత్రలో నటిస్తున్నాను“ అని తెలిపింది.

User Comments