ప్రియా వారియ‌ర్ బాలీవుడ్ గాసిప్స్

ప్రియా.. ప్రియా అంటూ ఇండియా మొత్తం ఊగిపోతుంది ఇప్పుడు. ఏం మాయ చేస్తుందో తెలియ‌దు కానీ ప్రియా వారియ‌ర్ చుట్టూ ఇప్పుడు అన్ని ఇండ‌స్ట్రీలు ప‌డుతున్నాయి. ఆ భామ మాత్రం ఎవ‌ర్నీ పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే తెలుగు, త‌మిళ నుంచి ప్రియా వారియ‌ర్ కు అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి. కానీ త‌న తొలి సినిమా ఒరు అడార్ ల‌వ్ విడుద‌లయ్యే వ‌ర‌కు కూడా మ‌రే సినిమాలో న‌టించకూడ‌దు అని ముందే ఫిక్స్ అయిపోయింది ప్రియా వారియ‌ర్. దానికితోడు చ‌దువు కూడా ముఖ్య‌మే. అందుకే సినిమాల‌కు ప్ర‌స్తుతానికి దూరంగా ఉంది ఈ భామ‌. అయితే బాలీవుడ్ నుంచి కూడా ఇప్పుడు టెంప్టింగ్ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి ఈ భామ‌కు.Priya Prakash Varrier Bollywood offers are Gossipsప్రియాకు వ‌స్తోన్న అవ‌కాశాలు చూసి అంతా షాక్ అవుతున్నారు. వ‌ద్ద‌న్నా కూడా వ‌స్తోన్న ఛాన్సులు చూసి వ‌ద్ద‌న‌లేక‌పోతుంది ప్రియా. బాలీవుడ్ నుంచి ఇప్ప‌టికే రెండు సినిమాల ఆఫ‌ర్లు వ‌చ్చాయి ఈ ముద్దుగుమ్మ‌కు. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో సిద్ధ‌మ‌వుతున్న టెంప‌ర్ రీమేక్ సింబాలో ప్రియాను కీల‌క‌పాత్ర కోసం అడుగుతున్నార‌ని ఒరు అడార్ ల‌వ్ ద‌ర్శ‌కుడు ఒమ‌ర్ తెలిపారు. టెంప‌ర్ లో ఓ అమ్మాయిని రేప్ చేస్తారు. బ‌హుశా అదే పాత్ర కోసం ప్రియాను అడుగుతున్నార‌ని తెలుస్తుంది.Priya Prakash Varrier Bollywood offers are Gossipsపింక్ లాంటి సంచ‌ల‌న సినిమాను తెర‌కెక్కించిన అనిరుద్ధ చౌద‌రి కూడా ప్రియాను త‌న సినిమాలో తీసుకోడానికి అడుగుతున్నాడు. కానీ ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ప్రియా ఓకే చెప్ప‌లేదు. అలాగ‌ని నో కూడా చెప్ప‌లేదు. ప్ర‌స్తుతానికి హోల్డ్ లో పెట్టేసింది. మ‌రి ప్రియా అడుగులు బాలీవుడ్  వైపు పడుతుందో లేదో..?Priya Prakash Varrier Bollywood offers are Gossips