ప్రియా కుట్టి అందరిని మోసం చేస్తుంది

ప్రియా ప్రకాష్ వారియ‌ర్.. 18 ఏళ్ల ఓ అమ్మాయి.. రెండు రోజులుగా ఇంట‌ర్నెట్ లో ఈమె పేరు త‌ప్ప మ‌రో పేరే వినిపించ‌ట్లేదు. అస‌లు ఏం చేసింది.. ఎలా చేసిందో తెలియ‌దు కానీ ఇప్పుడు ప్రియా చుట్టూనే కుర్రాళ్ల క‌ళ్ల‌న్నీ తిరుగుతున్నాయి. ఒక్క పాట‌లో ఆమె ఇచ్చిన ఒక్క ఎక్స్ ప్రెషన్ సోష‌ల్ మీడియానే ఊపేస్తుంది. నిజంగా ఈ ఎక్స్ ప్రెష‌న్ ఊపేస్తుందా.. లేదంటే వెన‌కాల ఉండి ఎవ‌రైనా ఇంత‌గా ప్ర‌మోట్ చేస్తున్నారా అనేది మాత్రం ఇప్పుడు మిస్ట‌రీగా మారిపోయింది. త‌న‌ను తాను ప్ర‌మోట్ చేసుకోవ‌డానికి ప్రియా వారియరే ఈ ప్లాన్ వేసింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

Priya Prakash Varrier Instagram instant increase followers

నెట్ లో కేవ‌లం ఈమె క‌నిపించే 27 సెక‌న్లు మాత్ర‌మే క‌ట్ చేసి పెట్టారు. ఇది ఎవ‌రో చేసింది కాదు.. ప్రియా టీం చేసింద‌నే వార్త‌లున్నాయి. ఇన్ స్టాగ్రామ్ లో మొన్న‌టి వ‌ర‌కు కేవ‌లం 2 ల‌క్ష‌ల 50 వేల మంది మాత్ర‌మే ఈమెకు ఫాలోవర్స్ ఉండేవాళ్లు. కానీ ఒరు అడార్ ల‌వ్ పాట విడుద‌లైన త‌ర్వాత దెబ్బ‌కు 24 గంట‌ల్లోనే ఆ లెక్క 10 ల‌క్ష‌ల‌కు చేరిపోయింది. ప్రస్తుతానికి 29 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.. అంటే మొత్తానికి రెండు రోజుల్లో దాదాపుగా 25 లక్షలకు పైగా ఫాలోవర్స్ పెరిగారన్న మాట.

Priya Prakash Varrier Instagram instant increase followers

ఒక్క రోజులో ఇంత మాయ ఎలా జ‌రిగింది..? అస‌లు ఈ భామ బ్యాగ్రౌండ్ ఏంటి అని అంతా ఆరా తీస్తున్నారు. ఈ భామ డిగ్రీ థ‌ర్డ్ ఇయ‌ర్ చేస్తుంది. ఓవైపు చ‌దువుకుంటూనే మ‌రోవైపు సినిమాల్లోనూ న‌టిస్తుంది. ఈ పాట‌లో ప్రియా ఇచ్చిన ఎక్స్ ప్రెష‌న్స్ బాగున్నాయి కానీ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోన్నంత సీన్ అయితే ఈ పాట‌లో ప్రియాకు లేద‌నిపిస్తుంది. ఇంత‌కంటే అద్భుతమైన ఎక్స్ ప్రెష‌న్స్ ఇచ్చిన వాళ్లు కూడా ఇంకా బోలెడున్నారు. కానీ పాపం వాళ్ల‌కు సోష‌ల్ మీడియాను ఎలా వాడుకోవాలో.. క్యాష్ చేసుకోవాలో తెలియ‌లేదు. అందుకే క్రేజ్ రాలేదు. కానీ ప్రియా మాత్రం ఈ విష‌యంలో చాలా ముదురు. అందుకే త‌న క్రేజ్ ను తానే తెచ్చిపెట్టుకుంది.

Priya Prakash Varrier Instagram instant increase followers

ఇప్పుడు ఈ పాట ఇచ్చిన దెబ్బ‌తో అమ్మ‌డుకు హీరోయిన్ అవ‌కాశాలు కూడా వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఉన్న సీన్ చూస్తుంటే మ‌రో ఏడాదిలోనే మలయాళ ఇండ‌స్ట్రీలో ప్రియా స్టార్ హీరోయిన్ అయినా ఆశ్చ‌ర్య ప‌డాల్సిన ప‌నైతే లేదు. సోష‌ల్ మీడియాను ఇలా కూడా వాడేసుకోవ‌చ్చా అని ఇప్పుడు ప్రియాను చూసి అంతా షాక్ అవుతున్నారు.

https://www.instagram.com/p/BfI8ciDnnUW/?taken-by=priyapvarrieroffl