ప్రియా కుట్టి సన్నీ లియోన్ కంటే ఎక్కువ

Last Updated on by

ఇప్పుడు ఇదే నిజ‌మ‌య్యేలా క‌నిపిస్తుంది. సోష‌ల్ మీడియా వ‌చ్చిన త‌ర్వాత ఎవ‌రు ఎప్పుడు ఎందుకు ఫేమ‌స్ అవుతున్నారో అర్థం కావడం లేదు. ప్రియా వారియ‌ర్ కూడా అంతే. స‌రిగ్గా 10 రోజుల కింద ఈ పిల్ల ఎవ‌రో కూడా ఎవ‌రికీ తెలియ‌దు. కానీ ఇప్పుడు ఈ అమ్మాయెవ‌రో తెలియ‌ని వాళ్ళే ఉండ‌రు. అంత‌గా ఫేమ‌స్ అయిపోయింది ఈ భామ‌. ఎక్క‌డో కేర‌ళ‌లో డిగ్రీ ఫ‌స్ట్ ఇయ‌ర్ చ‌దువుకునే ఈ అమ్మాయి ఇప్పుడు గూగుల్ లో ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ ట్రెండింగ్ అంటే న‌మ్మ‌గ‌ల‌మా..? ఇదే నిజం ఇప్పుడు. స‌న్నీలియోన్ ను సైతం ప్రియా వారియ‌ర్ త‌న క్రేజ్ తో వెన‌క్కి లాగేసింది. ఈ 18 ఏళ్ల పాప కోసం ఇప్పుడు ఇంట‌ర్నెట్ అంతా తెగ వెతికేస్తున్నారు కుర్రాళ్లంతా. ఒరు అడార్ ల‌వ్ పాటను ఇప్ప‌టికే వారం రోజుల్లోనే కోటి 15 ల‌క్ష‌ల మంది చూసారు.

Priya Prakash Varrier Instant Most Searched Person in India

ఇక ప్రియా ప‌ర్స‌నల్ ఇన్ స్టాలో కూడా కోటి మంది చూసారు. వారం కింద 2 ల‌క్ష‌ల మంది ఫాలోయ‌ర్స్ ఉన్న ప్రియా.. ఇప్పుడు 38 ల‌క్ష‌ల మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. ఒక్క వారంలో ఇంత మాయ ఎలా జ‌రిగింది..? అస‌లు ఈ భామ ఎవ‌రు అంటూ ఇప్పుడు అంతా ఆమె గురించే ఆరా తీస్తున్నారు. ఓ వైపు బ‌న్నీ లాంటి స్టార్ హీరోలు.. మ‌రోవైపు రాజ‌కీయ నాయ‌కులు.. ఇలా ఒక్క‌రేంటి అంతా ఇప్పుడు ప్రియా జ‌ప‌మే చేస్తున్నారు. మ‌రోవైపు ఈమె ఉన్న పాట‌పై ముస్లిం సోద‌రులు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తూ పోలీస్ కేస్ కూడా ఫైల్ చేసారు. అది మ‌హ్మద్ ప్ర‌వ‌క్త‌, అత‌డి భార్య పాడుకునే ప్రేమ‌గీతం అంటూ.. అందులో వీళ్లు క‌న్నుగొట్టి అస‌భ్య‌క‌రంగా చేసారంటూ కేస్ పెట్టారు. ఇప్పుడు దాన్ని కూడా వెన‌క్కి తీసుకున్నారు. ఇలా అన్నీ ఇప్పుడు ప్రియాకు క‌లిసొస్తున్నాయి. ఖచ్చితంగా ఈ భామ మ‌రికొన్ని రోజుల్లో ఇండియాస్ టాప్ ట్రెండింగ్ బ్యూటీ కావ‌డం ఖాయం. చూడాలి.. ప్రియా జ‌పం ఇంకా ఎన్నాళ్లు సాగ‌నుందో..?

https://www.instagram.com/p/Be-0hR9jBqT/?taken-by=priya.p.varrier

User Comments