కన్ను కొట్టిన ప్రియా సుప్రీమ్ కోర్ట్ కు వెళ్ళింది

Last Updated on by

ఈ ప్ర‌పంచంలో ఫ్రీగా ఏదొచ్చినా అంత ఈజీగా వ‌ద‌ల‌రు ఎవ్వ‌రూ. అలాగే ఇప్పుడు ప్రియా వారియ‌ర్ ఇష్యూ కూడా సీరియ‌స్ గా న‌డుస్తుంది. ఒక్క సీన్ తో ఇండియా మొత్తం మోస్ట్ వాంటెడ్ బ్యూటీ అయిపోయింది ప్రియా. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతోమంది ముద్దుగుమ్మ‌లు క‌న్నుగొట్టారు కానీ ఎవ‌రికీ ఇంత ఫాలోయింగ్ అయితే రాలేదు. కానీ ఒరు ఆదార్ ల‌వ్ తో మ‌తిపోయే ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ప్రియా వారియ‌ర్. ఫ్రీగా ప‌బ్లిసిటీ వ‌చ్చిన‌పుడు.. ఫ్రీగా వివాదాలు కూడా వ‌స్తాయి. ఈ పాట విడుద‌లై యూ ట్యూబ్ తో పాటు అన్ని చోట్లా సంచ‌ల‌నం సృష్టిస్తుంది. మ‌రో వైపు ఇదే పాట ముస్లిం వాళ్ల మ‌నోభావాలు దెబ్బ‌తీస్తుంద‌ని కేస్ కూడా ఫైల్ అయింది.Priya Prakash Varrier Moves Supreme Court Against Criminal Caseప్రియా వారియ‌ర్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తనపై ఎలాంటి క్రిమినల్‌ చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాల్సిందిగా దేశ ఉన్న‌త‌ న్యాయస్థాన్ని కోరింది. ఇప్పుడు ఆమె డిగ్రీ చ‌దువుకుంటుంది. ఇప్పుడు కానీ క్రిమిన‌ల్ కేస్ ప‌డితే అది ప్రియా కెరీర్ పైనే మ‌చ్చ‌లా ప‌డిపోతుంది. పైగా ఈ పాట‌లో ప్రియా కేవ‌లం న‌టించింది అంతే. అస‌లు కేస్ పెడితే ఆ సినిమా చేసిన ద‌ర్శ‌కుడో.. నిర్మాత‌పైనో పెట్టాలి కానీ ప్రియాపై కేస్ పెట్ట‌డం ఏంటి అంటున్నారు న్యాయ నిపుణులు. మ‌రోవైపు ఈ చిత్ర ద‌ర్శ‌కుడిపై కూడా ఓ వ‌ర్గం తెలంగాణ, మహరాష్ట్రల్లో పోలీసుల‌కు చెప్పి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. హైదరాబాద్‌లోనే ఈ తొలి కేస్ ఫైల్ కావ‌డం విశేషం. అయితే ఆ కేస్ రిట‌ర్న్ తీసుకున్నారు. ఇప్పుడు మ‌రో కేస్ త‌న కెరీర్ మెడ‌కు చుట్టుకోకుండా ముందుగానే సుప్రీమ్ ను ఆశ్ర‌యించింది ప్రియా వారియ‌ర్. పేరులోనే వారియ‌ర్ ఉంది క‌దా.. అందుకే వార్ చేస్తుంది ఈ భామ‌. మ‌రి.. ఈ పోలీస్ కేస్ నుంచి ముద్దుగుమ్మ ఎలా బ‌య‌ట‌ప‌డ‌నుందో..?

User Comments