తెలుగ‌మ్మాయికి నార్త్‌స్టార్‌ బూస్ట‌ప్‌

టాలీవుడ్‌లో తెలుగ‌మ్మాయిల ప్ర‌వాహంపై ప్ర‌స్తుతం స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇషారెబ్బా, యామిని భాస్క‌ర్, శోభిత ధూళిపాల‌, పావ‌ని వంటి క‌థానాయిక‌లు టాలీవుడ్‌లో రాణిస్తున్నారు. ఇప్పుడు అదే కోవ‌లో మ‌రో తెలుగ‌మ్మాయి ప్రియా వ‌డ్ల‌మాని క‌థానాయిక‌గా అదృష్టం ప‌రీక్షించుకుంటోంది. ఈ భామ ప్ర‌స్తుతం మూడు సినిమాల‌కు సంత‌కాలు చేసి జోరు మీద ఉండ‌డం ఫిలింన‌గ‌ర్‌లో చ‌ర్చ‌కొచ్చింది.

తొలిగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్నేహితుడు, నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత శ‌ర‌త్ మ‌రార్ స‌మ‌ర్ప‌ణ‌లో స్టోన్ మీడియా ఫిలింస్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తున్న `ప్రేమ‌కు రెయిన్ చెక్‌` సెప్టెంబ‌ర్ 7న‌ రిలీజ్‌కి వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో ప్రియా వ‌డ్ల‌మాని మాట్లాడుతూ -“ప్రేమ‌కు రెయిన్ చెక్ అంటే ప్ర‌త్యేక అర్థం ఉంది. స‌హ‌జంగానే స్నేహితుల మ‌ధ్య ఇలాంటి సంభాష‌ణ ఉంటుంది. ఎవ‌రైనా పార్టీ అడిగితే ఇప్పుడు వ‌ద్దు.. త‌ర్వాత ప్లాన్ చేద్దాం! అంటూ చెక్ పెడుతుంటారు. అలానే ప్రేమ‌కు కూడా చెక్ పెట్టే ఓ కుర్రాడి వ్య‌వ‌హారంపై తీసిన సినిమా కాబ‌ట్టి.. ప్రేమ‌కు రెయిన్ చెక్ అనే టైటిల్‌ని నిర్ణ‌యించారు. అస‌లు ప‌ని చేసే చోట ప్రేమ కుద‌ర‌ద‌ని న‌మ్మే కుర్రాడు ప్రేమ‌కు చెక్ పెడితే ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందనేదే సినిమా క‌థాంశం. ఈ చిత్రంలో నా పాత్ర ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. కాన్ఫిడెంట్‌గా ఉండే అమ్మాయిగా ఈ చిత్రంలో క‌నిపిస్తాను. కోస్టార్ అభిషేక్ చ‌క్క‌ని ప్ర‌తిభావంతుడు. ఈ చిత్రంలో అడ్వెంచ‌ర్ స్పోర్ట్స్ , పారా గ్లైడింగ్ లాంటివి ఆస‌క్తి రేకెత్తిస్తాయి. ఎంట‌ర్‌ప్రెన్యూర్ కం ఫిలింమేక‌ర్ ఆకెళ్ల పేరి శ్రీ‌నివాస్ ఎంతో ప్ర‌ణాళిక‌బద్ధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో న‌టీన‌టుల నుంచి అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న రాబ‌ట్టుకున్నారు“ అని తెలిపారు. త‌దుప‌రి సినిమాల గురించి ప్ర‌స్థావిస్తూ .. శుభ‌లేఖ‌+లు, హుషారు చిత్రాల్లోనూ న‌టిస్తున్నాను. ఇదివ‌ర‌కూ ఫేస్‌బుక్ అనే చిత్రంలో అవ‌కాశం వ‌చ్చినా న‌టించ‌డం కుద‌ర‌లేదు. తొలిగా నా కెరీర్‌లో `ప్రేమ‌కు రెయిన్ చెక్` చిత్రం రిలీజ‌వుతోంది.. అని తెలిపారు. నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, స్టోన్ మీడియా న‌వ‌త‌రం న‌టీనటుల్ని ఎంక‌రేజ్ చేయ‌డం సంతోషాన్నిచ్చింద‌ని తెలిపారు