జాతీయ ఆస్తులపై ప్రియావారియ‌ర్ క‌న్ను

Last Updated on by

ప్రియా వారియ‌ర్.. 18 ఏళ్ల ఓ అమ్మాయి.. కొన్ని రోజులుగా ఇంట‌ర్నెట్ లో ఈమె పేరు త‌ప్ప మ‌రో పేరే వినిపించ‌ట్లేదు. ఒక్క పాట‌లో ఆమె ఇచ్చిన ఒక్క ఎక్స్ ప్రెషన్ దేశాన్నే ఊపేసింది. ఈమె క‌నిపించే 27 సెక‌న్లు దేశంలోని కుర్రాళ్లంద‌ర్నీ మాయ చేసింది. ఇన్ స్టాగ్రామ్ లో మొన్న‌టి వ‌ర‌కు కేవ‌లం 2 ల‌క్ష‌ల 50 వేల మంది మాత్ర‌మే ఈమెకు ఫాలోయ‌ర్స్ ఉండేవాళ్లు. కానీ ఒరు అడార్ ల‌వ్ పాట విడుద‌లైన త‌ర్వాత దెబ్బ‌కు ఇప్పుడు 62 ల‌క్ష‌ల‌కు చేరిపోయింది. ఈమె త‌న ఇన్ స్టాలో ఏదైనా ప్ర‌మోట్ చేయాల‌న్నా కూడా ఒక్కో బ్రాండ్ కు 8 ల‌క్ష‌లు ఛార్జ్ చేస్తుంది. ఇది చూసి బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఫ్లాట్ అయిపోతున్నారు. ఇక ఇప్పుడు మ‌రో సంచ‌ల‌నం కూడా సృష్టించింది ప్రియా వారియ‌ర్. ఈమెతో ఓ నేష‌న‌ల్ యాడ్ షూట్ చేసారు.

ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ గా సాగే ఈ యాడ్ కోసం ఏకంగా కోటి రూపాయ‌లు తీసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. దానికి త‌గ్గ‌ట్లు చిట్టిపొట్టి దుస్తుల్లోనే క‌నిపిస్తుంది ప్రియా. ఓ వైపు చ‌దువుకుంటూనే మ‌రోవైపు సినిమాల్లోనూ న‌టిస్తుంది. సోష‌ల్ మీడియా క్రేజ్ ను ఎలా వాడుకోవాలో.. ఎలా క్యాష్ చేసుకోవాలో ప‌ర్ ఫెక్ట్ గా తెలుసుకుని రంగంలోకి దిగింది ప్రియా. ప్ర‌స్తుతం ఉన్న సీన్ చూస్తుంటే మ‌రో ఏడాదిలోనే ప్రియా స్టార్ హీరోయిన్ అయినా ఆశ్చ‌ర్య ప‌డాల్సిన ప‌నైతే లేదు. సోష‌ల్ మీడియాను ఇలా కూడా వాడేసుకోవ‌చ్చా అని ఇప్పుడు ప్రియాను చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్ టెంప‌ర్ రీమేక్ సింబాలో రోహిత్ శెట్టి కీల‌క‌పాత్ర కోసం అడిగితే నో చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. త్వ‌ర‌లోనే పూర్థిస్థాయి హీరోయిన్ గా ర‌ప్ఫాడించ‌డానికి రెడీ అయిపోయింది ప్రియా వారియ‌ర్.

User Comments