త‌ల్లి కాబోతున్న ప్రియాంక చోప్రా

Last Updated on by

అవును.. మీరు చ‌దివింది నిజ‌మే..! నిజంగానే ప్రియాంక చోప్రా త‌ల్లి కాబోతుంది. ఈ మ‌ధ్య కాలంలో పూర్తిగా హాలీవుడ్ లోనే ఉంది ఈ భామ‌. అక్క‌డే వ‌ర‌స సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్న ఈ భామ ఇప్పుడు మ‌ళ్లీ బాలీవుడ్ వైపు.. ఇండియా వైపు చూస్తుంది. ఈ స‌మ‌యంలోనే పిగ్గీ చోప్స్ త‌ల్లి కాబోతుంది. దానికి కార‌ణం అభిషేక్ బ‌చ్చ‌న్. ఈ క‌థ వెన‌క చిన్న మిస్ట‌రీ ఉంది. త్వ‌ర‌లోనే ఈ ఇద్ద‌రూ క‌లిసి ఓ సినిమాలో న‌టించ‌బోతున్నారు. అందులో ప్రియాంక చోప్రా, అభిషేక్  భార్యా భ‌ర్త‌లుగా న‌టించ‌బోతున్నారు. వాళ్ల‌కు 18 ఏళ్ల అమ్మాయి కూడా ఉండ‌బోతుంది. విన‌డానికి విచిత్రంగా ఉంది క‌దా.. కానీ ఇదే నిజం. స్వ‌యానా చిత్ర‌యూనిట్ ఈ విష‌యాన్ని క‌న్ఫ‌ర్మ్ చేసాక న‌మ్మ‌క త‌ప్పుతుందా..? అస‌లు విష‌యానికొస్తే.. పూణేలో కొన్నేళ్ల కింద అయేషా చౌద‌రి అనే 18 ఏళ్ల అమ్మాయి అరుదైన వ్యాధితో బాధ‌ప‌డి క‌న్నుమూసింది.

ఆ అమ్మాయి బ‌తికి ఉన్న ప్ర‌తీరోజు ఆ వ్యాధితో న‌ర‌కం చూసింది. ఇప్పుడు అదే క‌థ‌ను.. ఆమె జీవితాన్ని తెర‌కెక్కించ‌బోతున్నాడు డైరెక్ట‌ర్ షోనాలీ బోస్. చిన్నతనంలోనే ఇమ్యునో డెఫిషియెన్సీ డిజార్టర్‌తో బాధపడింది అయేషా. ఆ త‌ర్వాత 13 ఏళ్ల వయసులో పల్మోనరీ ఫైబ్రోసిస్ అనే వ్యాధికి గురయింది. ఎన్ని మందులు వాడినా.. వైద్యులు ఎంత‌గా శ్ర‌మించినా అయేషా చ‌నిపోయింది. ఇప్పుడు ఆ పాత్ర‌లో దంగ‌ల్ ఫేమ్ జైరా వ‌సీం న‌టించ‌బోతుంది. ఎంతో హృద్యంగా ఉన్న ఈ క‌థ‌ను ఇప్పుడు సినిమాగా మ‌ల‌చ‌బోతున్నారు. ఆ పాప‌కు త‌ల్లిదండ్రులుగా ప్రియాంక‌, అభిషేక్ న‌టించ‌బోతున్నారు. ఆగ‌స్ట్ నుంచి ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. మొత్తానికి గ్లామ‌ర్ రోల్స్ తో పిచ్చెక్కిస్తున్న ప్రియాంక‌.. చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ ప‌ర్ఫార్మెన్స్ కు షిఫ్ట్ అవ్వ‌బోతుంది.

User Comments