పాపం ప్రియాంక అందాలు.. అంతా అస్సామే..!

Last Updated on by

అంతా అస్సాం.. ఈ మాట తెలుగులో బాగా పాపుల‌ర్. ఏదైనా ప‌ని జ‌ర‌క్క‌పోతే అంతా అస్సాం అంటూ వెక్కిరిస్తారు. ఇప్పుడు ప్రియాంక చోప్రా విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతుంది. ఈమె చేసిన ఒక్క ఫోటోషూట్ ఇప్పుడు పెంట పెంట చేస్తుంది అస్సాంలో. అది కూడా అక్క‌డి టూరిజం కోసం చేసిన క్యాలెండ‌ర్ ఫోటోషూట్. కాస్త హాట్ గా ద‌ర్శ‌నం ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ‌.
Priyanka Chopra Cleavage Controversyఈ పోస్ట‌ర్లు అస్సాంలో అక్క‌డ‌క్క‌డా ద‌ర్శ‌నం ఇచ్చాయి కూడా. దాంతో ఇప్పుడు ఆ ఫోటోల‌ను ప‌ట్టుకుని కాంగ్రెస్ విమ‌ర్శ‌నాస్త్రాలు ఎక్కుపెట్టింది అధికార పార్టీపై. ప్రియాంక ధ‌రించిన అది(ఆమె ధరించిన గౌన్‌) అస్సామీ సంప్రదాయానికి వ్యతిరేకం. ఆదాయం కోసం ప్రభుత్వం మరీ ఇంత దిగజారాలా..? అస్సాం ఆన‌వాయితీని ప్ర‌భుత్వ‌మే ద‌గ్గ‌రుండి నాశ‌నం చేస్తుందంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నందితా దాస్‌, రుప్‌జ్యోతి కుర్మిలు అసెంబ్లీలో చర్చ లేవనెత్తి వెంటనే ప్రియాంకను అంబాసిడర్‌ నుంచి తొలగించాలంటూ డిమాండ్‌ చేశారు.
Priyanka Chopra Cleavage Controversyదాంతో నార్మ‌ల్ గా స‌భ అంతా ర‌చ్చ ర‌చ్చ అయింది. ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ ఉంది. ఒక్క‌సారి లాజిక్ గా ఆలోచిస్తే.. ఎక్క‌డో ఉన్న ప్రియాంక చోప్రాను తీసుకొచ్చి అస్సాంకు ఎందుకు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా పెట్టుకున్నారు. ఏదో చేస్తుంద‌నేగా.. అది ఇలాగే ఉంటుంద‌ని ఖచ్చితంగా వాళ్ల‌కు కూడా తెలుసు. హీరోయిన్ అన్న త‌ర్వాత ఖచ్చితంగా అందాల ఆర‌బోత ఉంటుంది. అందులో అనుమానం అవ‌స‌రం లేదు. పైగా ప్రియాంక లాంటి ముద్దుగుమ్మ‌ల‌కు అందాల ప్ర‌ద‌ర్శ‌న‌ అంటే పెద్ద‌గా లెక్కుండ‌దు. మ‌రి అలాంటి హీరోయిన్ ను తీసుకొచ్చిన‌పుడు సెలెబ్రెటీ అంటే ఎలా ఉంటుందో చూపించింది ఈ ముద్దుగుమ్మ‌. దీన్నే ఇప్పుడు ర‌చ్చ చేస్తే ఎలా అంటున్నారు ఆమె అభిమానులు.
Priyanka Chopra Cleavage Controversyఇప్పుడు జ‌రుగుతున్న ర‌చ్చ‌పై అస్సాం పర్యాటక శాఖా మంత్రి హిమంత బిస్వా.. ప్రియాంకను వెనకేసుకొచ్చారు. కాంగ్రెస్‌ చీప్‌ పబ్లిసిటీకి అల‌వాటు ప‌డింది. మ‌రోసారి అదే చేస్తుంది. అసలు ఆ ఫోటోల్లో అంత అసభ్యత ఎక్కుడుందో మాకు అర్థం కావ‌డం లేదు. ఏదైనా సంప్రదాయక వేడుకలు జరిగి నప్పుడు ధోతి, చీరలు అంటూ అదే పద్ధతిలో కనిపించాలి. కానీ ఇది పర్యాటక శాఖకు సంబంధించిన అంశం.. ఇక్క‌డికి విదేశీయులు కూడా వ‌స్తూ ఉంటారు. వాళ్ల‌ను ఆక‌ర్షించ‌డానికి ఇలాంటివి త‌ప్ప‌దు. చీరల్లో పిలిస్తే ఎవరూ రారు. అయినా అస్సామీ చిత్రాల్లో నటించే హీరోయిన్లు కూడా అన్ని రకాల దుస్తులు ధరిస్తుంటారన్న విషయం విమర్శలు చేసేవారికి కూడా తెలిసే ఉంటుందంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. మొత్తానికి ఇప్పుడు ప్రియాంక చేసిన అందాల ర‌చ్చ అస్సాం అసెంబ్లీని సైతం ఊపేస్తుంద‌న్న‌మాట‌.

User Comments