ఇండియా ప‌రువు తీసిన ప్రియాంక చోప్రా..

Last Updated on by

మ‌న హీరోయిన్ క‌దా.. హాలీవుడ్ లో వెళ్లి జెండా పాతేస్తుంది క‌దా.. ఇక్క‌డి నుంచి వెళ్లి అక్క‌డ అద‌ర‌గొడుతుంది అంటూ ప్రియాంక చోప్రా గురించి మ‌న ద‌గ్గ‌ర గొప్ప‌లు చెప్పుకుంటున్నాం. కానీ ఒక్క‌సారి అంద‌లం ఎక్కిన త‌ర్వాత శున‌కం బుద్ధి ఎక్క‌డైనా ఒక్క‌టే అని నిరూపించింది ఈ భామ‌. హాలీవుడ్ లో కాస్త పేరు రాగానే.. త‌ను ఎక్క‌డి నుంచి వ‌చ్చానో కూడా మ‌రిచిపోయింది. పుట్టిన నేల‌.. ఇచ్చిన గౌర‌వం.. తెచ్చిన పేరు అన్నీ ఒకేసారి మంట‌లో క‌లిపేసింది. హాలీవుడ్ లో అవ‌కాశాల కోసం మ‌న ఇండియా ప‌రువును తీసుకెళ్లి తెల్లోడి కాళ్ల ముందు ప‌డేసింది ఈ మాయ‌లేడి.

ఎమ్మీ అవార్డ్స్ వేడుక‌లో బాలీవుడ్ లో ఎమైనా నేర్పించండి అని అడిగితె.. ఇక్క‌డ అంతా న‌డుము.. వ‌క్షోజాలు ఊప‌డం త‌ప్ప ఇంకేం ఉండ‌దు అంటూ బాలీవుడ్ గురించి.. ఇండియ‌న్ సినిమా గురించి చాలా నీచంగా మాట్లాడేసింది ప్రియాంక చోప్రా. ఇప్పుడు ఈమె మాట‌ల‌పై బాలీవుడ్ చాలా సీరియ‌స్ అవుతుంది. నీకు అవకాశాలు ఇచ్చి స్టార్ ని చేస్తే.. అక్క‌డ‌కి వెళ్లి మ‌న ఇండ‌స్ట్రీ ప‌రువునే తీస్తావా అంటూ ప్రియాంక‌పై ఫైర్ అవుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ప్ర‌స్తుతం హాలీవుడ్ లో క్వాంటికో సిరీస్ 3తో పాటు రెండు సినిమాల్లోనూ న‌టిస్తుంది ప్రియాంక‌. ఈ మ‌ధ్యే ఓ బాలీవుడ్ సినిమా ఒప్పుకున్న ఈ బ్యూటీ.. మ‌రి ఇక్క‌డికి వ‌చ్చి అదే న‌డుము.. వ‌క్షోజాలు ఊపుతూ బ‌తికేస్తుందేమో..!

User Comments