పెళ్లి త‌ర్వాతే మందేస్తోందా?

Last Updated on by

పెళ్లి త‌ర్వాత పీసీ తొలి టీవీ షో వేడెక్కించింది. ఈ షోలో ప్రియాంక చోప్రా ట‌కీలా అనే అరుదైన మ‌త్తు పానీయం పుచ్చుకుని అంద‌రికీ షాకిచ్చింది. అంతే కాదు భార‌త‌దేశంలో ఉన్నప్పుడు రెడ్ వైన్ పుచ్చుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాన‌ని పీసీ చెప్పింది. అక్క‌డ ఎక్కువ అదే పుచ్చుకుంటార‌ని న‌వ్వేసింది. ప్ర‌ఖ్యాత ఎలెన్ డీజెనెర్స్ షోలో పీసీ యాక్టివిటీ వాడి వేడి చ‌ర్చ‌కు తెర తీసింది. ప్ర‌స్తుతం యువ‌త‌రంలో ఇదో హాట్ టాపిక్.

అమెరిక‌న్ సింగ‌ర్, న‌టుడు నిక్ జోనాస్ ని పెళ్లాడిన పీసీ ప్ర‌స్తుతం ఏ కిడ్ లైక్ జేక్ అనే చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే పెళ్లి అనంత‌రం అమెరికా ప‌ర్య‌ట‌న‌తో వేడెక్కిస్తోంది. ఎలెన్ షోలో రెడ్ గౌన్‌లో అందాలొలికిస్తూ హాట్ హాట్‌గా ద‌ర్శ‌న‌మివ్వ‌డ‌మే గాకుండా బిగ్ షాకింగ్ ట్విస్టులు ఇచ్చింది. ర‌క‌ర‌కాల వ్య‌క్తిగ‌త విష‌యాల‌పై షోలో మాట్లాడిన పీసీ ఈ షోలో త‌న మూడ‌వ హాలీవుడ్ ఫిలిమ్‌ని ప్ర‌మోట్ చేసుకోబోతోందిట‌. ఈ షోను హెడిల్‌ట‌న్ ప్లానెట్‌లో చిత్రీక‌రించారు. దీన్ని జ‌న‌వ‌రి 30న టెలికాస్ట్ చేయ‌నున్నార‌ట‌. నిక్‌ను పెళ్లాడిన త‌రువాత హాలీవుడ్ దృష్టిని ఆక‌ర్షించ‌డంలో స‌క్సెస్ అయిన ప్రియాంక ఈ షోలో హాలీవుడ్ గురించి విస్తృతంగా త‌న భావాల‌ను పంచుకున్న‌ట్లు చెబుతున్నారు.

User Comments