ప్రియాంక కంటే అంద‌గ‌త్తె లేదంట‌..!

Last Updated on by

ప్రియాంక చోప్రా కంటే హాట్ గా ఈ భూమ్మీద ఎవ‌రు లేరంట‌..! ఇది మ‌నం చెబుతున్న మాట కాదు.. మ్యాగ్జిమ్ మ్యాగ్జిమ‌మ్ స‌ర్వే చేసి చెబుతున్న మాట‌. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా నాలుగో సారి హాటెస్ట్ ఉమెన్ ఆన్ ది ప్లానెట్ అవార్డ్ అందుకుంది ప్రియాంక చోప్రా. హాలీవుడ్ హీరోయిన్ ల‌కు సైతం సాధ్యం కాని రికార్డ్ ఇది. మ్యాగ్జిమ్ కూడా స‌ర్వే నిర్వ‌హించి.. ఓ పోల్ పెట్టి మ‌రీ హాటెస్ట్ ఉమెన్ ను ఎంపిక చేస్తుంది ప్ర‌తీ ఏడాది. 2018కి గాను ప్రియాంక చోప్రా ఈ అవార్డ్ అందుకుంది.

గ‌తంలో కూడా మూడు సార్లు ఈ అవార్డ్ సొంతం చేసుకుంది ప్రియాంక‌. ఇక ఇప్పుడు హాలీవుడ్ లోనే పాగా వేయ‌డంతో మ‌రింత క్రేజ్ పెరిగిపోయింది ఈ భామ‌కు. మ్యాగ్జిమ్ హాట్ 100లో టాప్ బ్యూటీగా నిలిచి హాలీవుడ్ హీరోయిన్ల‌కు కూడా ఝ‌ల‌క్ ఇచ్చింది ప్రియాంక చోప్రా. ప్ర‌స్తుతం చాలారోజుల త‌ర్వాత ఇండియా వ‌చ్చింది ప్రియాంక చోప్రా. ప్ర‌స్తుతం ప్రియుడు నిక్ జోన్స్ తో క‌లిసి గోవాలో ఎంజాయ్ చేసి ముంబై కు వచ్చింది. త్వ‌ర‌లోనే ఈ కుర్రాన్ని పెళ్లి కూడా చేసుకుంటుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ భామ దూకుడు చూస్తుంటే ఇంకా ఏదేదో చేసేలా క‌నిపిస్తుంది.

User Comments