ల‌వ్ బ‌ర్డ్స్ సైకిల్ షికార్‌

Last Updated on by

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డెసిష‌న్స్‌తో వాడివేడి చ‌ర్చ‌కు తావిచ్చింది ప్రియాంక చోప్రా. ఈ మాజీ మిస్ ఏ నిర్ణ‌యం తీసుకున్నా, అందులో గ‌ట్స్ క‌నిపిస్తున్నాయ‌న్న చ‌ర్చా సాగుతోంది. ఇదివ‌ర‌కూ `ఫ్యాష‌న్` సినిమాతో టేకాఫ్ తీస్కున్న ఈ భామ అటుపై కెరీర్ ప‌రంగా వెనుదిరిగి చూసింది లేదు. అయితే ఇంత‌టితో ఆగిపోతే క‌ష్టం అనుకున్న‌దే త‌డ‌వుగా.. ఓ బంగారు బికినీతో పాప్ ఆల్బ‌మ్ రూపొందించి ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది. స‌రిగ్గా ఆ వీడియోనే పీసీకి అమెరికాలో క్వాంటికో ఆఫ‌ర్ తెచ్చింది. పాశ్చాత్య దేశాల్లో మ‌న ప్రియాంక చోప్రాకి అసాధార‌ణ ఫాలోయింగ్ పెరిగింది. రెండు సీజ‌న్ల‌లో పీసీ అదిరిపోయే రోల్ చేసింది. ఇక‌పోతే విదేశాల‌కు వెళ్లిన ప్రియాంక చోప్రా ప్ర‌స్తుతం అక్క‌డే సెటిల‌య్యే ప‌నిలో ఉంది. అక్క‌డ ఓ అంద‌మైన రాకుమారుడిని బుట్టలో వేసి ఇండియాకే తీసుకొచ్చేసింది.

అంతేనా? ఇందులో ఎలాంటి దాప‌రికం లేకుండా ఓపెన్‌గానే త‌న ప్రేమాయ‌ణాన్ని సాగిస్తోంది. ఇటీవ‌లే సోద‌రి ప‌రిణీతితో, ల‌వ‌ర్ నిక్ జోనాస్‌తో క‌లిసి ఈ భామ ముంబై చిట‌ప‌ట చినుకుల్లో త‌డిసిముద్ద‌యింది. ఆ త‌ర్వాత గోవా వెళ్లి సెల‌బ్రేష‌న్స్ చేసుకుంది. న్యూయార్క్‌లో మొద‌లైన ప్రేమాయ‌ణం గోవా వ‌ర‌కూ అలా అలా సాగిపోయింది. నిక్‌తో ఇప్ప‌టికే పీసీ నిశ్చితార్థం పూర్త‌యిందన్న ప్ర‌చార‌మూ ఉంది. ఇదిగో ప‌నిలో ప‌నిగా త‌న ప్రియుడు నిక్‌తో క‌లిసి పీసీ ఇలా సైకిల్ షికారు బ‌య‌ల్దేరింది. రోజు రోజుకి ఈ ప్రేమాయ‌ణం జోరెక్కిపోతోంది. చూడ‌ముచ్చ‌టైన జంట అంటూ పొగిడేస్తూనే వ‌య‌సులో అంత తేడా ఏంటో? అంటూ పెద‌వి విరిచేవాళ్లు ఉన్నారు. ఇక‌పోతే త‌న‌కంటే 15ఏళ్ల చిన్న‌వాడైన నిక్‌ని పీసీ పెళ్లాడేందుకు సిద్ధ‌మ‌వుతోంద‌న్న ప్ర‌చారం ఊపేస్తోంది.

User Comments