బాయ్ ఫ్రెండ్ ను వ‌దిలేసిన ప్రియాంక‌

Last Updated on by

అదేంటి.. మొన్నే క‌దా ప‌ట్టుకుంది.. అప్పుడే వ‌దిలేసిందా..? మ‌ళ్లీ ఏమైంది కోరుకునే క‌దా తెచ్చుకుంది అనుకుంటున్నారా..? అవును.. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ను వ‌దిలేసింది కానీ పూర్తిగా కాదు. జస్ట్ అలా లండ‌న్ లోనే వ‌దిలేసి.. తాను మాత్ర‌మే ముంబైకి వ‌చ్చింది ప్రియాంక చోప్రా. హాలీవుడ్ లోనే ఉంటూ అక్క‌డే కాలం గ‌డిపేస్తున్న ప్రియాంక‌కు ఈ మ‌ధ్య పుట్టిన‌దేశం కూడా ఎందుకో అప్పుడ‌ప్పుడూ గుర్తొస్తుంది. అందుకే అలా ఓ సారి వ‌చ్చి వెళ్తుంది ఈ ముద్దుగుమ్మ‌. మొన్న‌టికి మొన్న ముంబైకి ప్రియుడు నిక్ జోన్స్ తో పాటే వ‌చ్చింది ఈ భామ‌. ఇక ఇప్పుడు మాత్రం ఒంట‌రిగా ముంబైలో క‌నిపించింది.

నిన్న‌టి వ‌ర‌కు లండ‌న్ లో నిక్ తో ఫుల్ గా ఎంజాయ్ చేసింది ప్రియాంక చోప్రా. అత‌డితో సైక్లింగ్ చేస్తూ.. లండ‌న్ రోడ్ల‌పై తిరిగింది. స‌డ‌న్ గా రాత్రికి రాత్రే ఫ్లైట్ ఎక్కేసి ఇండియాలో ల్యాండ్ అయింది ఈ ముద్దుగుమ్మ‌. బాలీవుడ్ లో ప్ర‌స్తుతం ఒకే ఒక్క సినిమాలో న‌టిస్తుంది పిగ్గీచోప్స్. స‌ల్మాన్ ఖాన్ హీరోగా అలీఅబ్బాస్ జాఫ‌ర్ తెర‌కెక్కించ‌బోయే భర‌త్ కు క‌మిటైంది ప్రియాంక చోప్రా. అయితే ఆ సినిమా ప‌ట్టాలెక్క‌డానికి ఇంకాస్త టైమ్ ఉంది. ఆ లోపు ముంబైలో ఉన్న ప‌నులు చ‌క్క‌బెట్టుకుని మ‌ళ్లీ లండ‌న్ వెళ్లిపోనుంది ఈ భామ‌.

User Comments