ప్రియాంక డేటింగ్.. నిజమెంత‌..?

Last Updated on by

ప్రియాంక చోప్రా అంటే ఇన్నాళ్ళూ కేవ‌లం ఇండియ‌న్ సినిమా హీరోయిన్ అని స‌రిపెట్టుకునేవాళ్లు కానీ ఇప్పుడు అలా కాదుగా. క్వాంటికో సిరీస్.. బేవాచ్ సినిమాల త‌ర్వాత హాలీవుడ్ లో కూడా ప్రియాంకకు స్టార్ ఇమేజ్ వ‌చ్చేసింది. హాలీవుడ్ స్టార్స్ తో ప‌రిచ‌యాలు పెరిగిపోయాయి. పైగా అవకాశాలు కూడా బాగానే వ‌స్తున్నాయి. దీపిక అంటే ఒక్క సినిమానే ఇండియాకు వ‌చ్చేసింది కానీ పిసి మాత్రం అక్క‌డే సెటిల్ అయిపోవాల‌ని చూస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో ఓ పాతికేళ్ల కుర్రాడితో ప్రేమాయ‌ణం న‌డిపిస్తుంద‌నే వార్త‌లు బాగానే వినిపిస్తున్నాయి. సాక్ష్యం కింద కొన్ని ఫోటోలు కూడా క‌నిపిస్తున్నాయి.

Priyanka Chopra Secret Dating With Nick Jonas

తీరా ఆ కుర్రాడెవ‌రా అని ఆరా తీస్తే సింగర్ క‌మ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నిక్ జోనస్ అని తేలింది. ఈ మ‌ధ్య ఎక్క‌డ చూసినా ఈ జంటే ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. పైగా ప్రియాంక కూడా తమ రిలేష‌న్ పై ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్ పాస్ చేయ‌డం అంద‌రికీ షాక్ ఇచ్చింది. అవును.. నిక్ ఏమీ 11 ఏళ్ల పిల్లాడు కాదుగా అంటూ మాట పేల్చింది పిగ్గీచోప్స్. అంటే త‌మ బంధాన్ని ప‌బ్లిక్ చేస్తుంద‌నే అనుకోవాలా.. లేదంటే మీ ఇష్ట‌మొచ్చింది రాసుకోండ‌ని హింట్ ఇచ్చినట్లా తెలియ‌క తిక‌మ‌క‌ప‌డుతున్నారు అభిమానులు కూడా. ఈ మ‌ధ్యే ఓ హాలీడే టూర్ కూడా వెళ్లారు ఈ జంట‌. అందులో ప్రియాంక‌, నిక్ తో పాటు ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కానీ అంద‌రిలోనూ హైలైట్ అయింది మాత్రం ఈ ఇద్ద‌రే. ఒక‌రిపై ఒక‌రు ప‌డుతూ మ‌రీ ఫోటోల‌కు పోజిచ్చారు.

Priyanka Chopra Secret Dating With Nick Jonas

ఇది చూసిన త‌ర్వాతే ఇద్ద‌రూ డేటింగ్ లో కాదు.. ఏకంగా ఇంకేదో చేస్తున్నార‌నే ఊహ‌లు నిజం అని వినిపిస్తున్నాయి.. సాక్ష్యాలు క‌నిపిస్తున్నాయి. అస‌లు ఈ నిక్ తో ప్రియాంక‌కు ప‌రిచ‌యం అయింది ఇప్పుడు కాదు.. 2017 గాలా రెడ్ కార్పెట్ ద‌గ్గ‌రే ఈ ఇద్ద‌రూ తొలిసారి క‌లిసారు.. అక్క‌డే జంటగా మెరిశారు. ఆ సందర్భంగా ఒకరోజు డేట్ కు వెళ్లారు. అస‌లు అప్ప‌టి వ‌ర‌కు తెలియ‌ని వ్య‌క్తితో.. అందులోనూ త‌న‌కంటే వ‌య‌సులో ప‌దేళ్లు చిన్న‌వాడైన నిక్ జోన‌స్ తో డేటింగ్ కు ఎందుకు వెళ్లిందో తెలుసా.. ఇద్ద‌రూ ఒకే క‌ల‌ర్ డ్ర‌స్ వేసుకున్నార‌ని. ఇది విన్న త‌ర్వాత అంద‌రి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అయినా నిక్ చిన్న పిల్లోడు కాదుగా అంటూ వింత స‌మాధానాలు కూడా ఇస్తుంది ప్రియాంక చోప్రా. ఇదంతా చూస్తుంటే పెళ్లి మాటేమో కానీ ఖచ్చితంగా ప్రియాంక ఆ కుర్రాడితో డేటింగ్ లో ఉంద‌నే విష‌యం అయితే అర్థ‌మ‌వుతుంది.

User Comments