ప్రియాంక చోప్రా అందాలు ఫిల్మ్ ఫేర్ కోసమేన..!

Last Updated on by

హీరోలేం తోపులా అంటున్న ప్రియాంక చోప్రా.. ప‌దాలు మ‌న‌కోసం మార్చుకున్నా.. ప్రియాంక చోప్రా అన్న మాటైతే ఇదే. హీరోల కంటే మేమేం త‌క్కువ‌.. అమ్మాయిల‌ను ఎందుకు త‌క్కువ‌గా చూస్తారు.. ఓ అమ్మాయి గొంతు విప్పిందంటే చాలు అంతా ఆమె వైపు వేళ్లు చూపిస్తుంటారు ఎందుకు.. అడిగే వాళ్లు లేర‌నా అంటూ ఫైర్ అయింది ప్రియాంక చోప్రా. ఈమె ప్ర‌స్తుతం న్యూయార్క్ లో క్వాంటికో సీజ‌న్ 3 షూటింగ్ లో బిజీగా ఉంది. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు సీజ‌న్లు సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. ప్ర‌స్తుతం ఇండియాను పూర్తిగా మ‌రిచిపోయి అక్క‌డే సెటిల్ అయిపోయింది పిగ్గీచోప్స్. తాజాగా ఓ మ్యాగ‌జైన్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అమ్మాయిల హ‌క్కుల్ని ఎలా కాల‌రాస్తున్నార‌నే విషయంపై మాట్లాడింది ప్రియాంక చోప్రా.

Priyanka Chopra Shocking Comments on Relationship Filmfare

హీరోలు కోట్ల‌కు కోట్ల రెమ్యున‌రేష‌న్ లు తీసుకుంటే.. వాళ్ల‌ను సూప‌ర్ స్టార్ అని పొగుడుతారు. కానీ హీరోయిన్లకు ఇవ్వాలంటే మాత్రం ఇవ్వ‌రంటూ ఫైర్ అయింది. అంతేకాదు.. ఇండియా నుంచి తానొక్క‌దాన్నే ఫోర్బ్స్ లిస్ట్ లో ఉన్నాన‌ని.. దానికి తాను గ‌ర్వ‌ప‌డుతున్నాని చెప్పింది ప్రియాంక చోప్రా.

Priyanka Chopra Shocking Comments on Relationship Filmfare

అమెరిక‌న్ టెలివిజ‌న్ షోస్.. హాలీవుడ్ లో జ‌ర్నీ గురించి కూడా నోరు విప్పింది ప్రియాంక చోప్రా. తాను ఎప్పుడూ హాలీవుడ్ కు వెళ్తాన‌ని.. అక్క‌డ ఇలా సెటిల్ అవుతానని అనుకోలేద‌ని చెప్పింది ప్రియాంక చోప్రా. తాను నిజంగానే ఆ దేవుడి ద‌య ఉన్న బిడ్డ‌నేమో అనిపిస్తుంద‌ని చెబుతుంది ప్రియాంక‌.

Priyanka Chopra Shocking Comments on Relationship Filmfare

ప్ర‌తీ అమ్మాయి ఖచ్చితంగా ల‌క్ష్యాల్ని నిర్ధేశించుకుని వెళ్లాల‌ని చెబుతుంది ఈ భామ‌. ల‌క్ష్యం అనేది ఖచ్చితంగా మ‌నుషుల‌కు ఉండాల‌ని.. ముఖ్యంగా అబ్బాయిల నుంచి పోటీ త‌ట్టుకోవాలంటూ అమ్మాయిలు సొంతంగా త‌మ కాళ్ల‌పై నిల‌బ‌డాల‌ని చెప్పింది ప్రియాంక చోప్రా. త‌న త‌ల్లి రెండు కంపెనీల‌ను హ్యాండిల్ చేస్తుంద‌ని.. సొంతంగా డ‌బ్బు సంపాదించుకుంటుంద‌ని గుర్తు చేసుకుంది ఈ ముద్దుగుమ్మ‌.

Priyanka Chopra Shocking Comments on Relationship Filmfare

ప్రియాంక తన రిలేషన్ షిప్ గురించి కూడా ఓపెన్ గానే కామెంట్స్ చేసింది. ప్రస్తుతానికి తానూ సింగల్ అనే మాట గట్టిగానే చెప్పింది. ఒక సంవత్సరం నుంచి ఎలాంటి రిలేషన్ లో లేనని ఏది చేసినా చాలా కమిట్మెంట్ తో ఉంటానని షాకింగ్ కామెంట్స్ చేసింది ప్రియాంక చోప్రా.

Priyanka Chopra Shocking Comments on Relationship Filmfare

ప్ర‌తీ ఒక్క అమ్మాయి కూడా సొంతంగా క‌ష్ట‌ప‌డ‌టం నేర్చుకున్న‌పుడే పురుషాధిక్యం త‌గ్గుతుంద‌ని చెప్పింది ప్రియాంక చోప్రా. అబ్బాయిల‌పై ఇలా ప్రియాంక మాట్లాడ‌టం ఇదే తొలిసారి కాదు.. గ‌తంలో అబ్బాయిలు కేవ‌లం సెక్స్ కు మాత్ర‌మే ప‌నికొస్తార‌ని చెప్పి సంచ‌ల‌నం సృష్టించింది ప్రియాంక‌. ఇప్పుడు కూడా మ‌రోసారి సంచ‌ల‌న కామెంట్స్ చేసింది.

 

User Comments