ఇదేం ఫ్యాష‌న్ ఛీఛీ!

Last Updated on by

ఆ ఒంటిపై నూలుపోగైనా లేకుండా ఎన్నోసార్లు ఫోటోషూట్లలో పాల్గొంది ప్రియాంక చోప్రా. బికినీ షూట్‌లు, టూపీస్‌లో ఫోటోషూట్లు వీటికి క‌రువే లేదు. అయితే ఇటీవ‌లి కాలంలో పీసీలో ఊహాతీత‌మైన మార్పు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇన్నాళ్లు ఫ్యాష‌న్ అంటే కేవ‌లం భార‌తీయ‌త నిండి క‌నిపించేది. కానీ ఇప్పుడు ఆ లుక్‌ని పూర్తిగా వ‌దిలేసింది.

తానేదో ఓ హాలీవుడ్ స్టార్ అన్న‌ట్టే బిహేవ్ చేస్తోంది. తాను అనుస‌రిస్తున్న ఫ్యాష‌న్ అదే స్టైల్లో ఉంది. బ్రిటీష్ కుర్రాడు నిక్ జోనాస్‌తో రోకా అయిన‌ప్ప‌టినుంచి పీసీ ప్ర‌వ‌ర్త‌న‌లో అనూహ్యంగా ఈ మార్పు కొట్టొచ్చిన‌ట్టే క‌నిపిస్తోంది. అస‌లు ఆ డ్రెస్ సెన్స్ ఏంటో? ఫ్యాష‌న్ మీడియా అవార్డ్స్ 2018 వేడుక‌ల్లో ఇలా ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో హ‌వ్వ‌! ఇదేం ఫ్యాష‌న్ అంటూ అభిమానులంతా ఇన్‌స్టాలో ఫోటోని షేర్ చేస్తూ తెగ చీవాట్లు పెట్టేస్తున్నారు. తిట్ల దండ‌కం అందుకుంటున్నారు. అస‌లు నీకు ఇది సూట్ కాలేదంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయినా ఆ బాట‌మ్ లైన్‌లో ఈ పిచ్చి వ్యాప‌కం ఏంటో అంటూ ఒక‌టే వార్నింగులు ఇచ్చేస్తున్నారు. అస‌లు ఈ ఫ్యాష‌న్‌ని ఏమ‌ని పిల‌వాలి? అంటూ కొంద‌రు వాపోతున్నారు. కొంద‌రైతే ఆ చెత్త ఎక్స్‌పోజింగ్ త‌గ్గించ‌మ‌ని సూచించారు.

https://www.instagram.com/p/BnavaqunJiw/?taken-by=instabollywood.fc

User Comments