ఫోటో టాక్‌: మ‌ంగ‌ళ‌గిరి పిన్న‌మ్మ‌!

Last Updated on by

ఎవ‌ర‌మ్మా ఈ సోకిల్లాడీ? ఏరు దాటి ఎగేసుకొచ్చింది? ఎంకి నాయుడు మామ‌.. కంకి చేలోకి ర‌మ్మ‌న్న‌ట్టు.. పొద్దున్నే చ‌ద్ద‌న్నం క్యారేజీ.. ఆవ‌కాయ్ ప‌చ్చ‌డి ముక్కతో అలా బ‌య‌ల్దేరిపోయింది..! చూస్తుంటే కాసింత అటూ ఇటూగా అలానే ఉందీ లుక్‌. ది గ్రేట్ పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా సెల‌క్ష‌న్ ఏంటి మ‌రీ ఇంత చెత్త‌గా ఉంది? ఎంత స‌మ్మ‌ర్ అయితే మాత్రం మ‌రీ ఇలా ఆరాంగా ఆరేసేయాలా? మంగ‌ళ‌గిరి పిన్ని లాగా, పెద్దాపురం పెద్ద‌మ్మ‌లాగా త‌యారైందేం? ఈ ఫోటో చూడ‌గానే దేశ‌వ్యాప్తంగా యూత్‌లో ఒక‌టే గుస‌గుసలు.

పీసీ ప‌ర‌మ చెత్త డ్రెస్సింగ్.. వ‌ర‌స్ట్ డ్రెస్ అంటూ ఒక‌టే కామెంట్లు ప‌డిపోతున్నాయ్‌. కేన్స్‌లో ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో .. వైవిధ్యం ఉన్న డ్రెస్సుల‌తో అద‌ర‌గొట్టేసిన ఈ భామేనా? ఇప్పుడిలా ఫ్లాపైంది. మెట్‌గాలా ఈవెంట్‌లో సైతం మ‌రీ అంత గొప్ప డ్రెస్సులేవీ వేయ‌క‌పోయినా వేడెక్కించే కంటెంట్ కాస్తంత ఉందిలే అని పొగిడారు. అయితే ఇలా డ‌బ్బా డ్రెస్‌లో వెదురు పేళ్ల బుట్ట‌కు కాగితం ఛ‌మ్కీలు త‌గిలించుకుని ఇలా దిగిపోతుంద‌ని అనుకోలేదు! ప్చ్‌.. క్వాంటికో వాళ్లు ఎలా సెల‌క్ట్ చేసుకున్నారో? ఇలా అయితే క‌ష్టం పీసీ!! అన్న‌ట్టు ఈ డ్రెస్ ఖ‌రీదు ఎంతో తెలుసా? రూ. 1,26,282. అక్ష‌రాలా ల‌క్ష 26 వేలు. అదీ సంగ‌తి!!

User Comments