పృథ్వీపై మెగా ఫ్యామిలీ వేటు!

క‌మెడియ‌న్ 30 ఇంయ‌ర్స్ ఇండ‌స్ర్టీ పృథ్వీ వైకాపాలోకి జాయిన్ అనంత‌రం పొలిటిక‌ల్ గా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే. జ‌న‌సేన పార్టీపై…ప్ర‌జారాజ్యం పార్టీని విమ‌ర్శిస్తూ నోటికి గ‌ట్టిగానే ప‌నిచెప్పాడు. నేను న‌టుడినన్న విష‌యం సైంత విస్మ‌రించి పొలిటిక‌ల్ వ్యామోహంలో సినీ పెద్ద‌ల‌ను సైతం విమ‌ర్శించాడు. జ‌గ‌న్ గెలిచినా ఒక్క‌రూ అభినంద‌న‌ల‌లు తెల‌ప‌లేద‌ని వ‌కల్తా పుచ్చుకుని మ‌రీ మాట్లాడాడు. దీంతో అత‌ని సినిమా కెరీర్ భ‌విష్య‌త్ లో క‌ష్ట‌మేన‌ని అప్ప‌ట్లోనే వార్త‌లొచ్చాయి. తాజాగా వేటు మొద‌లైన‌ట్లు తెలుస్తోంది.

ముందుగా మెగా ఫ్యామిలీనే ఆయ‌న్ని ప‌క్క‌న పెట్టిన‌ట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో మంచి పాత్ర పృథ్వీకోసం త్రివిక్ర‌మ్ రాసాడుట‌. కానీ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు కార‌ణంగా పృథ్వీని ప‌క్క‌న‌బెట్టి అత‌ని స్థానంలో మ‌రో న‌టుడ్ని తీసుకోవాల‌ని చూస్తున్నారుట‌. ఇటీవ‌లే పృథ్వీని త్రివిక్ర‌మ్ ని అప్రోచ్ అవ్వ‌గా చూద్దాం లే అని లైట్ తీసుకున్నాడ‌ట‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ప్రాణ స్నేహితు త్రివిక్ర‌మ్. ఆయ‌న్నే విమ‌ర్శించిన న‌టుడికి త్రివిక్ర‌మ్ ఎలా ఛాన్స్ ఇస్తాడు. ఇక మెగా ఫ్యామిలీ అయితే పృథ్వీకి ఆ హీరో న‌టించే ఏ సినిమాలో కూడా ఛాన్స్ ఇవ్వ‌కూడ‌ద‌ని భావిస్తున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఇంకొంత మంది ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు పొలిటిక‌ల్ కాంట్రవ‌ర్శీ స్టార్ తో మ‌న‌కెందుకుని లైట్ తీసుకుంటున్నారుట‌.