స్టార్ హీరో మేనేజ‌ర్ పై అగ్ర‌నిర్మాత ఫైర్

స్టార్ హీరో అల్లు అర్జున్ త‌న మేనేజ‌ర్ పై సీరియ‌స్ అయ్యార‌ని ఇటీవ‌ల వార్త‌లొచ్చాయి. ఏఏ19 సెట్స్ లో బ‌న్ని కోపం అదుపు త‌ప్పింద‌ని అత‌డు ఇలా చేయ‌డం బాలేద‌ని మీడియాలో ప్ర‌చార‌మైంది. అయితే బ‌న్ని ఆరోజు అంత‌గా ఫైర‌వ్వ‌డానికి కార‌ణ‌మేంటి? అన్న‌ దానిపై ఇప్ప‌టివ‌ర‌కూ స‌రైన క్లారిటీనే లేదు. ఆ వార్త‌ను స్ప్రెడ్ చేసిన వాళ్లు స‌రైన స్ప‌ష్ఠ‌త‌ను ఇవ్వ‌లేదు. దాంతో బ‌న్నిపై బ‌య‌ట‌ మిస్ అండ‌ర్ స్టాండింగ్ స్టార్ట‌య్యింది. షూటింగ్ క్యాన్సిల్ అని చెప్పినందుకే బ‌న్ని ఇలా మేనేజ‌ర్ పై ఫైర‌య్యారా? అంటూ సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

తాజాగా ఈ ఫైరింగ్ వెన‌క అస‌లు కార‌ణం ఒక‌టి ఫిలింస‌ర్కిల్స్ లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఆరోజు  బ‌న్ని అలా త‌న మేనేజ‌ర్ పై ఫైర్ అవ్వ‌డానికి స్ప‌ష్ట‌మైన కార‌ణం ఉంది. వాస్త‌వానికి త‌న షెడ్యూల్స్ మిస్ క‌మ్యూనికేష‌న్ వ‌ల్ల బ‌న్ని అమెరికా ప్ర‌యాణం క్యాన్సిల్ అయ్యింద‌ట‌. ఈ ప్ర‌యాణం త‌న‌కు చాలా ముఖ్య‌మైన‌ది. స్నేహితుడు రానాకు అమెరికాలో శ‌స్త్ర చికిత్స జ‌ర‌గ‌నుంది. ఆ స‌మ‌యంలో త‌న‌కు అండ‌గా ఉండాల‌ని బ‌న్ని భావించారు. కానీ మేనేజ‌ర్ చేసిన ప‌ని వ‌ల్ల‌.. మిస్ క‌మ్యూనికేష‌న్ వ‌ల్ల అది కాస్తా మిస్స‌య్యాడు. అందుకే బ‌న్ని తీవ్రంగా అస‌హ‌నానికి గురై ఫైర‌య్యార‌ని తెలుస్తోంది. ఆయ‌న కోపం స‌ముచిత‌మైన‌దేన‌ని దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. అయితే బ‌న్ని ఎపిసోడ్ లో యువ‌హీరో రానా కిడ్నీ ఆప‌రేషన్ గురించి లీక్ చేసిన స‌ద‌రు మేనేజ‌ర్ పై అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు ఫైర‌య్యారనేది తాజా స‌మాచారం. వాస్త‌వానికి రానా చికిత్స గురించి బ‌య‌ట‌కు చెప్పాల‌ని అనుకోలేద‌ట‌. బ‌న్ని మేనేజ‌ర్ వ‌ల్ల‌నే ఆ స‌మాచారం లీకైంది. దీంతో ఆయ‌న‌కు కోపం వ‌చ్చి ఫైర‌య్యార‌ని తెలుస్తోంది.