దిల్ రాజుకు రూ. 4 కోట్లు నష్టమా..?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన సినిమాలను నిర్మించుకునే పద్ధతి, పక్క సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసుకునే విధానం ఎలా ఉంటుందో చాలామందికి తెలుసు. అందుకే సక్సెస్ తో పాటు పేరును కూడా ఒకే టైమ్ లో దక్కించుకునే అతి తక్కువ మంది ప్రొడ్యూసర్లలో ఒకరిగా టాలీవుడ్ లో ప్రత్యేకంగా నిలిచిపోతున్నారు దిల్ రాజు. అలాంటి దిల్ రాజుకు అప్పుడప్పుడూ ఫ్లాప్ లు కూడా ఎదురవ్వడం మనం చూశాం. అయితే, ఇప్పుడు వరుస సక్సెస్ లతో సత్తా చాటుతున్న టైమ్ లో కూడా దిల్ రాజుకు రూ. 4 కోట్లు నష్టం వచ్చినట్లు వార్తలు హల్ చల్ చేస్తుండటం గమనార్హం.

ఆ స్టోరీలోకి వెళితే, నిర్మాతగా వరుసగా నేను లోకల్, డీజే, ఫిదా అంటూ బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టిన దిల్ రాజు ఇప్పుడు మాత్రం గౌతమ్ నంద మరియు దర్శకుడు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి నష్టపోయారని తెలుస్తోంది. ప్రధానంగా గోపీచంద్ గౌతమ్ నంద సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 5.5 కోట్లే వసూలు చేయడంతో.. దిల్ రాజు కూడా 4 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశారట. ఈ సినిమా మొదట్నుంచీ మినిమమ్ గ్యారెంటీగా ఉన్నా.. ఫలితాలు మాత్రం తారుమారు కావడంతో నష్టాలు తప్పలేదని అంటున్నారు.

మరోవైపు సుకుమార్ కంపెనీ నుంచి వచ్చిన ‘దర్శకుడు’ సినిమాకు కూడా నెగిటివ్ టాక్ రావడంతో.. కొంతమేర దిల్ రాజుకు కూడా నష్టాలొచ్చాయని సమాచారం. దీంతో ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్ గా నష్టాలు రుచి చూసేసిన దిల్ రాజు.. ఇప్పుడు కొంత పెట్టుబడి పెడితే రిలీజ్ కు రెడీ అయిన జయ జానకి నాయక, లై సినిమాలతో టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా జయ జానకి నాయక సినిమాకు సంబంధించి నైజాం షేర్లు తీసుకోవడంతో.. అది ఎంతవరకు రికవరీ అవుతుందోనని ఇప్పుడే లెక్కలు వేసేస్తున్నారట. ఈ విషయంలో నితిన్ లై మాత్రం కొంచెం పాజిటివ్ టాక్ వస్తే.. బాగానే లాభాలు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. మరి దిల్ రాజు గోల్డెన్ హ్యాండ్ ఈ విషయంలో ఎలా ఉండబోతుందో చూడాలి.

Follow US