హీరో హీరోయిన్స్ పడుకోవడం నిజమే : లేడీ నిర్మాత

బాలీవుడ్ లో ఏక్తాక‌పూర్ అనే పేరుకే ఓ చ‌రిత్ర ఉంది. లేడీ ప్రొడ్యూస‌ర్ అనే మాటే కానీ ఎవ‌రికి లేనంత ధైర్యం ఈమె సొంతం. ఈమె మాట్లాడితే అంతా నోరు మూసుకోవాల్సిందే. అంత ప‌వ‌ర్ ఫుల్ గా మాట‌ల తూటాలు పేల్చేస్తుంటుంది. ఇప్పుడు కూడా ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ పై పూస గుచ్చిన‌ట్లు చెప్పింది ఏక్తా. అస‌లు ఇక్క‌డ ఏం జ‌రుగుతుందో మీకు తెలుసా.. తెలియ‌కుండా మాట్లాడ‌కండి అంటూ ఫైర్ అయింది. ఇండ‌స్ట్రీలో ఎప్పుడూ అమ్మాయిలే త‌ప్పు చేస్తార‌ని.. అబ్బాయిలే త‌ప్పులు చేస్తార‌ని ఓ నిర్ణ‌యానికి రావ‌ద్ద‌ని.. ఇక్క‌డ అంద‌రి త‌ప్పులు ఉంటాయ‌ని చెప్తుంది ఏక్తాక‌పూర్. క్యాస్టింగ్ కౌచ్ అంటే అవసరాల కోసం వాళ్ళ పక్కలో పడుకోవడం అన్నమాట.

Producer Ekta Kapoor Agreed on Casting Couch in Bollywood

క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పుడు కొత్త‌గా చెప్పాల్సింది కూడా ఏం లేద‌ని.. చాలా మంది యాక్ట‌ర్స్ వాళ్ల‌కు వాళ్లుగానే వ‌చ్చి త‌మ ఆఫ‌ర్స్ కోసం అన్నీ ఇచ్చేస్తుంటార‌ని ఓపెన్ గా సంచ‌ల‌న కామెంట్స్ చేసింది ఏక్తాక‌పూర్. ఇక సెక్స్ అనేది ఇక్క‌డ చాలా చిన్న మాట అని తేల్చేసింది ఈ లేడీ ప్రొడ్యూస‌ర్. ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు హీరోయిన్ల‌కు సెక్స్ కోసం ఆఫ‌ర్ చేస్తార‌నే కామెంట్స్ బ‌య‌టే ఉన్నాయి కానీ చాలా మంది హీరోయిన్లు అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల ఇళ్ల‌కు వెళ్తారు.. అక్క‌డే వాళ్ల‌తో రాత్రంతా గ‌డుపుతారు.. మ‌రి దాన్నేమంటారు. అది క్యాస్టింగ్ కౌంట్ అనాలా.. లేదంటే వాళ్ల‌కు ఇష్ట‌మై వెళ్లార‌నాలా అని ప‌చ్చిగానే ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న దారుణాల గురించి మాట్లాడింది ఏక్తాక‌పూర్. అస‌లు ఈమె మాట్లాడిన తీరు బాలీవుడ్ ఎలాంటి సిచ్చువేష‌న్ లో ఉందో చెప్ప‌క‌నే చెబుతుంది.

Producer Ekta Kapoor Agreed on Casting Couch in Bollywood

ఏక్తా పుట్టిన‌ప్ప‌ట్నుంచీ ఇండ‌స్ట్రీలోనే ఉంది. అక్క‌డ ఆమెకు జ‌రుగుతున్న విష‌యాలు కొత్త కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడ మగ అని తేడా లేదు. మగవాళ్ళు కూడా అవసరాల కోసం పడుకొంటున్న రోజులివి. అందుకే అస‌లు క్యాస్టింగ్ కౌచ్ అంటే ఎలా ఉందో పూస గుచ్చిన‌ట్లుగా చెబుతుంది ఈ భామ‌. ఇవ‌న్నీ మాట్లాడింది ఎక్క‌డో నాలుగు గోడ‌ల మ‌ధ్య కాదు.. ప్ర‌ముఖ పాత్రికేయురాలు బర్ఖాదత్ నిర్వహిస్తున్న ది టౌన్ హాల్ అనే కార్యక్రమానికి వ‌చ్చిన‌ ఏక్తా కపూర్.. ఇండ‌స్ట్రీలో ఉన్న ప‌రిస్థితుల‌పై మాట్లాడారు. అక్క‌డ చ‌ర్చ‌కు వ‌చ్చిన హాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత హార్వీ వెయిన్‌స్టన్ పేరుతో ఈ క్యాస్టింగ్ కౌచ్ ప్రస్తావన షురూ అయింది. ఈ చ‌ర్చ‌లోనే హాలీవుడ్ లోనే కాదు.. అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ క్యాస్టింగ్ కౌచ్ అనేది విచ్చ‌ల‌విడిగా ఉంద‌ని చెప్పుకొచ్చింది ఏక్తా. నిజానికి కొంద‌రు హీరోయిన్లు అయితే వాళ్ల‌కు వాళ్లుగా వ‌చ్చి సెక్స్ ఆఫ‌ర్ చేస్తారంటూ సంచ‌ల‌నం సృష్టించింది ఈమె. ఏక్తాక‌పూర్ చెప్పిందంటే ఇప్పుడక్క‌డ ప‌రిస్థితుల‌పై అంద‌రికీ ఓ అవ‌గాహ‌న వ‌చ్చేస్తుంది.

Producer Ekta Kapoor Agreed on Casting Couch in Bollywood