నిర్మాత కొడుకు డెత్ మిస్ట‌రీ

Last Updated on by

ప్రముఖ సినీ నిర్మాత ఎస్. గోపాల్ రెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెంద‌డంపై టాలీవుడ్‌లో స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అస‌లు భార్గ‌వ్ డెత్ మిస్ట‌రీ వెన‌క అస‌లు వాస్త‌వాలేంటి? అంటూ ఒక‌టే ఆరాలు మొద‌ల‌య్యాయి.

వివ‌రాల్లోకి వెళితే… నెల్లూరు జిల్లా- వాకాడు సముద్ర తీరంలోకి అనుమానాస్పద స్థితిలో ఓ మృతదేహం కొట్టుకురావడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఆ క్ర‌మంలోనే ఆ మృత‌దేహం ఓ ప్ర‌ముఖ సినీసెల‌బ్రిటీ వార‌సుడిది అని తెలుసుకున్నారు. ప‌రిశోధ‌న‌లో మృతుడు నిర్మాత ఎస్. గోపాల్ రెడ్డి తనయుడిగా తేలింది. అయితే భార్గ‌వ్ ఏదైనా కార‌ణం చేత‌ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదూ అత‌డిని ఎవరైనా హత్య చేసి సముద్రంలో పడవేశారా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మిస్ట‌రీ వెన‌క ఆర్థిక కార‌ణాలు ఏవైనా ఉన్నాయా? లేదూ కుటుంబ క‌ల‌హాలు కార‌ణ‌మా? అన్న‌దానిపైనా పోలీస్ విచార‌ణ సాగిస్తున్నారు.

User Comments