ఇన్సూరెన్స్ కొట్టేస్తోన్న ఓ నిర్మాత

ఇండ‌స్ట్రీ అంటేనే మోసాల‌కు నిల‌యం. ఇక్క‌డ మంచి వాళ్లు ఉంటారు.. చెడ్డ‌వాళ్లు కూడా ఉంటారు. వాళ్ల‌ను చెడ్డ‌వాళ్లు అని కూడా అన‌లేం. అవ‌కాశ వాదులు అంతే. వాళ్ల‌కు వ‌చ్చే అవ‌కాశం కోసం వేచి చూస్తుంటారు. వ‌స్తే గుట్టుచ‌ప్పుడు కాకుండా మింగేస్తుంటారు. ఇక్క‌డ గుడి కాదు.. గుళ్లో లింగం కూడా మింగే మ‌హానుభావులు చాలామందే ఉంటారు. సొంతంగా ఖ‌ర్చు చేసుకున్న డ‌బ్బును కూడా నిర్మాణం కోసం చేసామ‌ని చెప్పి ఇన్సూరెన్స్ నొక్కే నిర్మాత‌లు కూడా మ‌న ద‌గ్గ‌ర బోలెడంత మంది ఉన్నారు. ఈ మ‌ధ్య ఓ పెద్ద నిర్మాత ఇదే చేసాడ‌ని ఇండ‌స్ట్రీలో వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఆ నిర్మాత త‌న కొడుకుతోనే ఓ అడ్వంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్ చేయాల‌ని ఓ ద‌ర్శ‌కున్ని పిలిచి హాడావిడిగా సినిమా కూడా మొద‌లుపెట్టాడు. గ‌తేడాదే ఈ ద‌ర్శ‌కుడు ఫామ్ లో లేని.. ఎప్పుడో మ‌రిచిపోయిన ఓ హీరోను పెట్టి సినిమా చేసి సక్సెస్ అయ్యాడు. అది డ‌బ్బులు తీసుకురాక‌పోయినా పేరు అయితే బాగానే తీసుకొచ్చింది. ఆ న‌మ్మ‌కంతోనే ఆ నిర్మాత కొడుకు ఆ దర్శకున్ని పిలిచి తనతో సినిమా చేయాలని రిక్వెస్ట్ చేస్తే ఆ డైరెక్టర్ ఒప్పుకున్నాడు. ఈ సినిమా 40 కోట్ల బ‌డ్జెట్ అవుతుందని ముందే చెప్పాడు ఆ నిర్మాతకు. అప్పుడు ఒప్పుకొన్న నిర్మాత తర్వాత తన కొడుకుతో అంత బ‌డ్జెట్ వర్క్ అవుట్ కాదని తెలుగు కొని మెల్లగా ఆ డైరెక్టర్ ను తప్పించాడు.

కానీ ఇదే నిర్మాత ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఆగిపోయిన సినిమాకు ఇన్సూరెన్స్ చేసి ప్రీ ప్రొడక్షన్ కోసం 2 కోట్లు ఖర్చు పెట్టాడని చెప్పుకొంటున్నాడు ఆ నిర్మాత. తన సొంత ఇంటి కోసం తెచ్చుకొన్న వస్తువులను సినిమా కోసం అని చెప్పి ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొంటున్నాడు సదరు నిర్మాత. ఇది ఆయ‌న గారి మాస్టర్ ప్లాన్. మొత్తానికి ఆగిపోయిన సినిమా కోసం 2 కోట్లు ఖర్చు చేశాడని కవరింగ్ ఇస్తూనే ఇంట్లోకి ఫ్రీగా వస్తువులు తీసుకొచ్చుకొన్నాడు… అస‌లిది క‌దా బుర్రంటే. ఇలా ఉంటారు మ‌న ఇండ‌స్ట్రీలో నిర్మాత‌లు..!