ఎన్టీఆర్ బ‌యోపిక్‌.. విష్టుకు మొండిచెయ్యి!

Last Updated on by

విష్ణు ఇందూరి…. సీసీఎల్ క్రికెట్ సృష్టిక‌ర్త అంటే ట‌క్కున గుర్తొచ్చే పేరిది. మాస్ట‌ర్ మైండ్‌గా పేరున్న ఇత‌ని ఆలోచ‌న నుంచి పుట్టిందే `ఎన్టీఆర్‌` బ‌యోపిక్ అన్న స‌మాచారం ఉంది. ఎప్ప‌టికైనా ఎన్టీఆర్ జీవితాన్ని వెండి తెర‌పైకి తీసుకురావాల‌ని చాలా మంది ద‌ర్శ‌కుల‌ను క‌లిసి, ర‌చయిత‌ల‌ని ఏర్పాటు చేసుకుని స్క్రిప్ట్‌ను కొన్నేళ్ల క్రిత‌మే సిద్ధం చేయించాడు విష్ణు ఇందూరి. ఇది ఆనోట ఈనోట పాకి చివ‌రికి బాల‌య్య చెంత‌కు చేరింది. ఆ త‌రువాతే నిర్మాత సాయి కొర్ర‌పాటి తోడ‌య్యాడు. దీనికి నేను ఓ చెయ్యివేస్తాన‌ని బాల‌య్య‌కూడా సై అన్నాడు. అంతా ఓకే అనుకున్నాక సినిమాను ప‌ట్టాల‌పైకి తీసుకొచ్చారు. ఇక్క‌డే ఓ మ‌త‌ల‌బు జ‌రిగింది.

ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌మీద‌కు తీసుకురావ‌డానికి మూల‌కారకుడైన విష్ణు ఇందూరి ఇప్పుడు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. పోస్ట‌ర్ డిజైన్ ల మీద త‌ప్ప నిర్మాణం విష‌యంలో అత‌ని పాత్ర శూన్యం. మొత్తానికి అత‌న్ని నామ‌మాత్ర‌పు భాగ‌స్వామిని చేసేశారు. బాల‌కృష్ణ పూర్తిస్థాయి నిర్మాణ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత విష్ణు బ‌యోపిక్ చిత్రీక‌ర‌ణ ద‌రిదాపుల్లోనూ క‌నిపించ‌డం లేద‌నేది తాజాగా సినీ జ‌నాల్లో వినిపిస్తోంది. దానికి కార‌ణం బాల‌య్య స‌మీప బందువు ప్ర‌సాద్ అని తెలిసింది. నిర్మాణ బాధ్య‌త‌ల‌న్నీ ప్ర‌సాద్‌, ద‌ర్శ‌కుడు క్రిష్ క‌నుస‌న్న‌ల్లో జ‌రుగుతుండ‌టంతో విష్ణు ని దూరం పెట్టార‌నే ప్ర‌చారం జోరుగా వినిపిస్తోంది. తాజా ప‌రిణామాల నేప‌థ్య ంలో ఎన్టీఆర్ సినిమా నుంచి విష్ణు ఇందూరితో పాటు, సాయి కొర్ర‌పాటిని కూడా త‌ప్పిస్తార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్ర‌చారం వెనుక మాస్ట‌ర్ మైండ్ విష్ణు వున్నాడ‌ని, ఇంత కాలంగా వినిపించ‌ని వార్త‌లు ఇప్పుడెందుకు వినిపిస్తున్నాయ‌ని నంద‌మూరి అభిమానులు చెబుతున్నారు.

User Comments