సమంత పెళ్లి.. నిర్మాతల ఆనందం..

అదేంటి.. స‌మంత పెళ్లి అయితే నాగార్జున‌, నాగాచైత‌న్య క‌దా ఆనంద‌ప‌డాలి..! మ‌ధ్య‌లో నిర్మాతలు ఎందుకు ఆనంద‌ప‌డ‌తారు అనుకుంటున్నారా.. అవును.. మీరు అనుకుంటున్న‌ది నిజ‌మే. కానీ ఇప్పుడు నిజంగానే స‌మంత పెళ్లి అయినందుకు ఆమెతో సినిమాలు చేస్తోన్న నిర్మాత‌లు తెగ ఆనంద‌ప‌డిపోతున్నారు. ఏదో త్వ‌ర‌గా షూటింగ్ కు వ‌స్తుంది అని కాదు.. ఆమె పెళ్లి మూలంగా త‌మ సినిమాల‌కు ఫ్రీ ప‌బ్లిసిటీ వ‌స్తుంద‌ని. అవును.. ఈ మ‌ధ్య కాలంలో స‌మంత అనేది మోస్ట్ ట్రెండింగ్ నేమ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్క‌డ విన్నా స‌మంత పేరే వినిపిస్తుంది. దాంతో ఆమె న‌టిస్తోన్న సినిమాల‌కు కూడా ప‌బ్లిసిటీ.. ప్ర‌మోష‌న్ రెండూ వ‌స్తున్నాయి.

జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత ఒక్క సినిమా కూడా విడుద‌ల చేయ‌ని స‌మంత‌.. ఇప్పుడేమో వారం రోజుల గ్యాప్ లోనే రెండు సినిమాల‌తో రానుంది. ఒక‌టి అక్టోబ‌ర్ 13న రాజుగారిగ‌ది 2 అయితే.. అక్టోబ‌ర్ 18న విజ‌య్ మెర్స‌ల్.. అదే తెలుగులో అదిరింది. ఈ రెండు సినిమాల ప్ర‌మోష‌న్ కు స‌మంత పెళ్లి బాగా యూజ్ అవుతుంది. ఎలాగూ స‌మంత పేరు బ‌య‌ట మారుమోగిపోతుంది.. ఇలాంటి టైమ్ లో గానీ అమ్మ‌డు బ‌య‌టికి వ‌చ్చి ఒక్క‌టి గానీ ఇంట‌ర్వ్యూ ఇచ్చిందా.. ఇంక అంతే సంగతులు. కొత్త పెళ్లికూతురు ఏం చెప్పిందో అని అంతా వాటికే ఎగ‌బ‌డ‌తారు. మొత్తానికి ఈ పెళ్లి పుణ్యమా అని ఇలా నిర్మాత‌లు పండ‌గ చేసుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి.. స‌మంత పెళ్లి.. నిర్మాత‌ల ఆనందం త‌ప్పంటారా..?

Follow US