రాఘ‌వేంద్ర‌రావు ఉన్నా వ‌ద‌ల‌ను: పృథ్వీ

శ్రీవెంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛానెల్ అవినీతి అక్ర‌మాల‌పై విచార‌ణ జ‌రిపిస్తాన‌ని న‌టుడు, నూత‌న ఎస్వీబీసీ చైర్మ‌న్ పృథ్వీరాజ్ అన్నారు. ఛానల్‌లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయనున్నట్లు తెలిపారు. ఇక అవినీతి అక్రమాల విషయంలో గత ఛైర్మన్‌ రాఘవేంద్రరావు ఉన్నా విచారణ తప్పదని వ్యాఖ్యానించారు. కొండపై రాజకీయాలు చేయను. కొండపై పార్టీలు, జెండాల గురించి మాట్లాడను. కేవలం అజెండాలపైనే మాట్లాడతా. ఎస్వీబీసీ ఉద్యోగులను కుటుంబంలా భావించి, నేను కూడా ఐడీ కార్డు ధరించా. ఛైర్మన్‌ సంస్కృతిని మార్చా. ఎందుకంటే ఏకలవ్య శిష్యుడిలా స్వామివారిని కాపాడుకోవడమే నా కర్తవ్యం.

అక్రమాల విషయంలో రాఘవేంద్రరావు ఉన్నా, ఇంకెవరైనా ఉన్నా నాకు అనవసరం. నాకు ఎవరితోనూ విభేదాలు లేవు. ఒక వేళ పృథ్వీరాజ్‌ అక్రమాలకు పాల్పడినా జగన్మోహన్‌రెడ్డిగారు విచారణ జరిపిస్తారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడానికి జగన్‌గారి కాళ్లు పట్టుకోమన్నా పట్టుకుంటా. కార్మికులు బాగుండాలని కోరుకునే వారిలో నేను శాశ్వతంగా ఉండిపోవాలని నా కోరిక’’ అని చెప్పుకొచ్చారు.

Also Watch : Evaru Trailer Will Be Unveiled On This  Date