గ‌రుడ‌వేగ‌.. సీరియ‌స్ గా తీసుకోవాల్సిందే..!

గ‌రుడ‌వేగ‌.. నిజం చెప్పాలంటే ఈ చిత్రం మొద‌లుపెట్టిన‌పుడు క‌నీసం ప‌ట్టించుకున్న వాళ్లు కూడా లేరు. షూటింగ్ జ‌రుగుతున్న కొద్ది కూడా ప్ర‌వీణ్ స‌త్తార్ ఏదో పిచ్చి ప‌ట్టి రాజ‌శేఖ‌ర్ తో సినిమా చేస్తున్నాడ‌ని న‌వ్వుకున్నారు. కానీ త‌మ ప్ర‌య‌త్నం మాత్రం వాళ్లు ఆప‌లేదు. ఒక్కో స్టిల్.. టీజ‌ర్.. ట్రైల‌ర్ విడుద‌ల‌వుతుంటే గ‌రుడ‌వేగ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. బ‌డ్జెట్ విష‌యం నుంచి మేకింగ్ వ‌ర‌కు త‌న సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాడు ప్ర‌వీణ్ స‌త్తార్. ఇక ఇప్పుడు ట్రైల‌ర్ విడుద‌ల‌కు ఏకంగా బాల‌య్యే రావ‌డంతో సినిమాపై ఇండ‌స్ట్రీలో ఒక్క‌సారిగా చ‌ర్చ మొద‌లైంది. రాజ‌శేఖ‌ర్ ఈ సారి ఏదో కామెడీ కాదు సీరియ‌స్ గానే  చేస్తున్నార‌నే అటెన్ష‌న్ షురూ అయింది.

ఈ మధ్యే విడుద‌లైన టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఇప్పుడు ట్రైల‌ర్ చూస్తుంటే వామ్మో ఇది నిజంగానే రాజ‌శేఖ‌ర్ సినిమానా అనే డౌట్ వ‌స్తుంది. ప్ర‌వీణ్ స‌త్తార్ అంత బాగా తెర‌కెక్కించాడు. ఇన్నేళ్ల కెరీర్ లో రాజ‌శేఖ‌ర్ ఇంత స్టైలిష్ మూవీ ఎప్పుడూ చేయ‌లేదు. ఆయ‌న ఫామ్ లో ఉన్న టైమ్ లోనూ ఇంత భారీ బ‌డ్జెట్ సినిమాలో న‌టించ‌లేదు రాజ‌శేఖ‌ర్. కానీ ఫేడ‌వుట్ అయిపోయిన ఈ స‌మ‌యంలో గ‌రుడ‌వేగ లాంటి భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ చేస్తున్నాడు ఈ సీనియ‌ర్ హీరో. ఈ చిత్రానికి ఆయ‌న కూడా ఓ నిర్మాత‌గా ఉన్నాడు. బాల‌య్య రాక‌తో సినిమాపై హైప్ ఆటోమేటిక్ గా పెరిగిపోయింది. న‌వంబ‌ర్ 3న గ‌రుడ‌వేగ విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. గ‌రుడ‌వేగ మిష‌న్ ఎంత‌వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌కు చేరువ కానుందో..?