పూరీ ఈజ్ బ్యాక్ ఇంకెవ‌రు అన‌రు

Last Updated on by

మాట‌లు నేర్చిన చిల‌క ఉస్కో అంటే డిస్కో అందంట‌. ఇప్పుడు పూరీ త‌న‌యుడు ఆకాష్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈయ‌న వ‌య‌సు 20 ఏళ్లే కానీ మాట‌లు మాత్రం స్టార్ హీరోల రేంజ్ ఓ ఉన్నాయి. అన్నీ నేర్చుకునే ఇండ‌స్ట్రీకి వ‌స్తున్నాడు ఆకాష్. చిన్న‌ప్ప‌ట్నుంచీ సినిమా వాతావ‌ర‌ణంలోనే పెరిగాడు కాబ‌ట్టి మాట‌ల్లో ఆ భ‌యం బెరుకు కూడా క‌నిపించ‌ట్లేదు. త‌ను అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా మాట్లాడేస్తున్నాడు. మెహ‌బూబా ప్ర‌మోష‌న్ మొద‌లైందిప్పుడు. ఇందులో భాగంగానే నా ప్రాణం పాట విడుద‌ల కార్య‌క్ర‌మంలో పూరీ జ‌గ‌న్నాథ్ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన క‌బుర్లు చెప్పాడు ఈ కుర్ర హీరో.

త‌న నాన్న హిట్లు కొట్టాడు.. ఫ్లాపులు ఇచ్చాడు.. విజ‌యాలు వ‌చ్చిన‌పుడు ఆనందించాను.. బ్యాక్ వెళ్లిన‌పుడు బాధ ప‌డ్డాను. కానీ ఈ సారి మాత్రం చాలా గ‌ర్వంగా చెబుతున్నాను.. ఎలాంటి స్టార్ స‌పోర్ట్ లేని.. ఫ్యాన్ బేస్ లేని ఓ 20 ఏళ్ల కుర్రాడితో ఆయ‌న బ్యాక్ కాబోతున్నారు. త‌న ఫామ్ ఏంటో చూపించ‌బోతున్నారు. ఈ సారి పూరీ ఈజ్ బ్యాక్ అనే మాట ఇంకెవ‌రు అన‌రు ఎందుకంటే మెహ‌బూబా త‌ర్వాత ఎప్పుడూ ఆయ‌న బ్యాక్ అవ్వ‌రు అనే న‌మ్మ‌కం నాకుంది అని చెప్పాడు ఆకాష్. ఈ కుర్రాడి మాట‌ల‌కు అక్క‌డ చ‌ప్ప‌ట్ల మోత మోగిపోయింది. ఎంతైనా ద‌ర్శ‌కుడి కొడుకు క‌దా.. మాట‌ల్లో ఆ చ‌మ‌త్కారం ఎక్క‌డికి పోతుంది..?

User Comments