పూరి త‌మ్ముడు అయ్య‌న్న చుట్ట‌మా?

ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ సోద‌రుడు గ‌ణేష్ పెట్ల 2019 ఎన్నిక‌ల్లో వైకాపా త‌ర‌పున పోటీ చేసి ఎమ్మెల్యే అయిన సంగ‌తి తెలిసిందే. న‌ర్సీప‌ట్నం  నియోజ‌వ‌ర్గంలో తేదేపా సీనియ‌ర్ నాయ‌కుడిగా వ‌రుస విజ‌యాల‌తో అజేయుడిగా రికార్డులు అందుకున్న అయ్య‌న్న పాత్రుడిపై అత‌డు గ‌త ఎన్నిక‌ల్లో విజ‌య‌దుందుబి మోగించాడు. అయితే ఇప్పుడు అయ్య‌న్న‌కు యువ ఎమ్మెల్యే గ‌ణేష్ కు మ‌ధ్య వైరం న‌డుస్తోందా? అంటే ఆ ఇరువురి న‌డుమ లాలూచీపై స్థానిక ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిక‌ర ప్ర‌చారం సాగుతోంది.

గ‌ణేష్ తో అయ్య‌న్నకు రాజీ బేరం కుదిరిందన్న గుస‌గుస వేడెక్కిస్తోంది. అలాగే అయ్య‌న్న‌తో గ‌ణేష్ కి ఎలాంటి వ్య‌క్తిగ‌త వైరం లేక‌పోవ‌డం.. పైగా ఒకే క‌మ్యూనిటీకి చెందిన నాయ‌కులు కావ‌డంతో ఆ ఇరువురి మ‌ధ్య ఇన్న‌ర్ గేమ్ న‌డుస్తోంద‌ని స్థానిక ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. గ‌ణేష్ ఎమ్మెల్యే అయ్యాక న‌ర్సీప‌ట్నం అంతా స్థ‌బ్ధుగానే ఉంది. న‌గ‌రంలో చాలా వ్య‌వ‌హ‌రాల్లో ఎలాంటి వైరం లేకుండా స‌మ‌స్య‌లు స‌మ‌సిపోతున్నాయ‌ట‌. అప్ప‌ట్లో న‌ర్సీప‌ట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ స్థ‌లంలో విశాఖ తేదేపా మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు షాపింగ్ మాల్ నిర్మాణానికి ప్లాన్ చేసారు. ఆ స‌మ‌యంలో అయ్య‌న్న అడ్డు ప‌డ్డారు. త‌న‌కు గ‌ణేష్ నుంచి ఆ స‌మ‌యంలో సాయం అందింద‌ని చెబుతారు.

ఆ ఒక్క విష‌యంలోనే కాదు.. స్థానిక స‌మ‌స్య‌ల విష‌యంలో ఒక‌రితో ఒక‌రికి స‌ర్ధుబాటు ఉంటోంద‌న్న గుస‌గుస వినిపిస్తోంది. ఇక న‌ర్సీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుతం ఎలాంటి గ‌డ‌బిడా లేదు. పైగా అధికార‌- ప్ర‌తిప‌క్ష నాయ‌కుల లాలూచీతో ప్ర‌శాంత‌వాతావ‌ర‌ణం ఉండ‌డంపైనా ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక అయ్య‌న్న‌కు పూరి త‌మ్ముడు గ‌ణేష్ ఎంతో క్లోజ్. అత‌డి రాజ‌కీయ జీవితం ప్రారంభించింది అయ్య‌న్న వ‌ద్ద‌నే కాబ‌ట్టి సీనియ‌ర్ నాయ‌కుడైన అయ్య‌న్న‌కు అత‌డు వ్య‌క్తిగ‌త విధేయుడు అన్న ముచ్చ‌టా సాగుతోంది. ఇక అయ్య‌న్న సోద‌రుడు గ‌త ఎన్నిక‌ల ముందు వ్యూహాత్మ‌కంగా వైకాపాలో చేర‌డం అత‌డు ప్ర‌స్తుతం గ‌ణేష్ తో క‌లిసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తుండ‌డం చూస్తుంటే ఆ ఇద్ద‌రి మ‌ధ్యా అస‌లు ఎలాంటి గేమ్ న‌డుస్తోందోన‌న్న ముచ్చ‌టా వేడెక్కిస్తోంది.