పూరి హీరో ర‌వితేజకు విల‌న్

Rogue actor Ishan villain in Maha Samudram

నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా ఆర్.ఎక్స్ 100 ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి ఓ సినిమా తెర‌కెక్కిస్తార‌ని ప్ర‌చార‌మైంది. అయితే ఆ ప్రాజెక్ట్ ఇంకా కన్ఫామ్ కాలేదు. ఈలోగానే అత‌డు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌కు వేరొక‌ క‌థ వినిపించార‌ని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు ఇంకా ర‌వితేజ సంత‌కం చేయ‌లేదు. ప్ర‌స్తుతం అత‌డు ఫైన‌ల్ స్క్రిప్టు వినే ప‌నిలో ఉన్నార‌ట‌. ఈలోగానే ఈ ప్రాజెక్టులో రోగ్ ఫేం.. పూరి డిస్క‌వ‌రి ఇషాన్ విల‌న్ గా న‌టిస్తార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

2017లో స్టార్ డైరెక్ట‌ర్ పూరి తెరకెక్కించిన `రోగ్` చిత్రంతో ఇషాన్ హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. కానీ తొలి ప్ర‌య‌త్నం విఫ‌ల‌మ‌వ్వ‌డంతో స‌రైన ఛాన్సులు రాలేదు. అయితే ఈ చిత్రంలో ఇషాన్ ఎంతో ఎన‌ర్జిటిక్ గా న‌టించాడ‌ని క్రిటిక్స్ ప్ర‌శంసించ‌డం కొస‌మెరుపు. ఇంత‌కాలానికి ఆర్జీవీ శిష్యుడు అజ‌య్ భూప‌తి రూపంలో ఓ అవ‌కాశం ద‌క్కింది. అది కూడా విల‌న్ గా అత‌డికి ఛాన్స్ ద‌క్క‌డం ఆస‌క్తిక‌రం. ఈ సినిమాకి మ‌హా స‌ముద్రం అనే టైటిల్ వినిపిస్తోంది. కొన్ని వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత ర‌వితేజ ఆచితూచి స్క్రిప్టుల్ని ఎంపిక చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.