పూరి ‘బాలయ్య అభిమానైతే..’

బాలకృష్ణపై పూరికి ఇప్పుడు ఎక్కడాలేని అభిమానం పుట్టుకొచ్చింది. బాలకృష్ణను వెనకేసుకు వస్తున్నాడు.  ఎందుకా అని ఆరాతీస్తే.. అర్ధమయింది ఏమిటి అంటే ప్రస్తుతం బాలయ్యతో పైసా వసూల్ చేస్తున్నాడు కదా.. అందుకే ఇలా అని ఉండొచ్చు.

అప్ కమింగ్ దర్శకుడైతే సరేలే సినిమా చేస్తున్నాడు కాబట్టి హీరోను పొగిడాడు అనుకోవచ్చు.  పూరి స్టార్ దర్శకుడు.  ఎన్నో సూపర్ హిట్స్ అందించాడు.  తక్కువ సమయంలో అనుకున్న బడ్జెట్ తో సినిమాలు తీయగల దిట్ట.  ఇలాంటి పూరి ఇలా మాట్లాడటం ఏమిటన్నదే ఇక్కడ ప్రశ్న.

బాలయ్యకు అభిమాన సంఘం ఉంటె దానికి తాను అధ్యక్షుడిగా ఉంటానని చెప్పాడు. పైసా వసూల్ సినిమాతో పూరి బాలకృష్ణకు అభిమానిగా మారిపోయాడు.  అసలు బాలకృష్ణతో ఇప్పటివరకు తాను ఎందుకు సినిమా చేయలేక పోయాను అని తెగ బాధపడి పోతున్నాడట.

అందుకే పైసా వసూల్ తరువాత బాలయ్యతో మరో సినిమా చేస్తానని ఖరాఖండిగా చెప్తున్నాడు పూరి. ఒక హీరోతో సినిమా చేస్తూ.. అతనికి అభిమానిని అని చెప్పుకుంటే.. దానివలన ఇబందులు వస్తాయి.

ఒక హీరోను వెనకేసుకు వచ్చినపుడు.. మరో హీరోతో సినిమా అవకాశాలు రాకపోవచ్చు. హీరోలకు ప్రేక్షకులు అభిమానులుగా ఉండొచ్చు.  దర్శకులు కూడా ఉంటారు.  కాకపొతే బయటపడరు.  ఇది ఇండస్ట్రీలో అందరికి తెలిసిన విషయమే.

కొంతమంది హీరోలకు దర్శకులు అభిమానులుగా ఉన్నారు.  అందులో ఒకరు వివివినాయక్.  చిరంజీవికి వీరాభియాని.  చిరును అన్నయ్య అని పిలుస్తుంటాడు.  ఇలాంటి వ్యక్తులు బహు అరుదుగా కనిపిస్తుంటారు.  అలాంటి వ్యక్తుల్లో ఇప్పుడు పూరి కూడా చేరిపోయాడు. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే పైసా వసూల్ రిలీజ్ అయ్యేంత వరకు ఆగాల్సిందేనండోయ్.

Follow US