మెహ‌బూబా ఓవ‌ర్సీస్ లో అదిరింద‌బ్బా..!

Last Updated on by

ఎందుకో తెలియ‌దు కానీ పూరీ జ‌గ‌న్నాథ్ సినిమాపై రోజురోజుకీ అంచ‌నాలు బాగా పెరిగిపోతున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు కూడా పూరీ సినిమా పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. తీసిందే మ‌ళ్లీ మ‌ళ్లీ తీస్తాడు అంటూ లైట్ తీసుకున్నారు ప్రేక్ష‌కులు. కానీ ఇప్పుడు మెహ‌బూబా విష‌యంలో మాత్రం పూరీ కొత్త‌గా క‌నిపిస్తున్నాడు. కొడుకు కాబ‌ట్టి అలా చేసాడేమో కానీ చాలా ఏళ్ల త‌ర్వాత ప‌ర్ ఫెక్ట్ ల‌వ్ స్టోరీతో వస్తున్నాడు. అది కూడా ఇండో పాక్ క‌హానీతో. ఓ సినిమాకు క్రేజ్ రావ‌డానికి ఇండియా పాకిస్థాన్ కంటే క‌మ‌ర్షియ‌ల్ అంశం ఏముంటుంది చెప్పండి..? ఇప్పుడు ఇదే హైలైట్ చేస్తున్నాడు పూరీ.

మే 11న మెహ‌బూబా విడుద‌ల కానుంది. దాంతో ప్ర‌మోష‌న్స్ లో కూడా జోరు పెంచేసారు. ఇండియాలో ఈ సినిమాను దిల్ రాజు విడుద‌ల చేస్తుండ‌టం విశేషం. దాంతో సినిమాపై అంచ‌నాలు కూడా అలాగే ఉన్నాయి. ఇక ఓవ‌ర్సీస్లో ఈ చిత్రాన్ని బ్లూ స్కై విడుద‌ల చేస్తుంది. అక్క‌డ కూడా భారీగానే వ‌స్తుంది మెహ‌బూబా. ఈ చిత్రంతో త‌న‌యుడికి హిట్ ఇవ్వ‌డ‌మే కాదు.. త‌ను కూడా ఫామ్ లోకి వ‌స్తాన‌ని ధీమాగా చెబుతున్నాడు ఈ డేరింగ్ డైరెక్ట‌ర్. ప‌డ‌టం లేవ‌డం ప‌రిగెత్త‌డం పూరీకి అలవాటే. గ‌తంలోనూ కొన్నిసార్లు ఇలాగే ప‌డి లేచాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు.

User Comments