మహేష్ ఆకాష్ మధ్యలో పూరీ

Last Updated on by

పూరీ జ‌గ‌న్నాథ్ అంటే ముందుగా గుర్తొచ్చేది అత‌డి పంచ్ డైలాగులే. సినిమాల్లో అయినా.. బ‌య‌ట అయినా మాట‌ల మ‌రాఠీ ఈ పూరీ. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. మెహ‌బూబా పాట విడుద‌ల కార్య‌క్ర‌మంలో పాల్గొన్న పూరీ.. త‌న మాట‌ల చాతుర్యాన్ని చూపించారు. త‌న కెరీర్ లో తొలిసారి ఓ జ‌న్యూన్ సినిమా చేసాన‌ని చెప్పాడు పూరీ. ఇక ఈ చిత్రంలో హీరో ఆకాష్ గురించి చెప్పాలి.. వాడు చిన్న‌ప్ప‌ట్నుంచి తెలుసు.. మా ఇంట్లోనే ఉండేవాడంటూ త‌న కుమారుడిపైనే స‌ర‌దా కామెంట్స్ చేసారు. 4 ఏళ్లు ఉన్న‌ప్ప‌ట్నుంచే ఒక్క వేశం అంటూ త‌న‌ను చంపేసేవాడ‌ని.. ఆ పోరు ప‌డ‌లేకే చిరుత‌లో వేశం ఇచ్చాన‌ని చెప్పాడు పూరీ.

ఇక 8 ఏళ్లున్న‌పుడే మ‌హేష్ బాబు కోసం క‌థ రాసుకున్నాడ‌ని.. అది మ‌హేష్ కు చెప్పాలంటూ ఒక‌టే గోల చేసేవాడ‌ని చెప్పాడు పూరీ. ఇంత‌కీ ఆ క‌థ‌లో ఏముందో తెలుసా.. ప‌దేళ్ల కుర్రాడికి మ‌హేష్ స్నేహితుడు.. ఈ కుర్రాన్ని చూడ‌కుండా మ‌హేష్ ఉండ‌లేడు.. అలాంటి మ‌హేష్ ను ఓ రోజు విల‌న్లు చంపేస్తారు.. ఆ ప‌గ‌ను కుర్రాడు ఎలా తీర్చుకున్నాడు అనేది అస‌లు క‌థ‌. ఇది కానీ మ‌హేష్ కు చెబితే ఇద్ద‌ర్ని తంతాడ‌ని పూరీ జోకులు పేల్చాడు. ఖచ్చితంగా మెహ‌బూబా సినిమా చూసిన త‌ర్వాత ప్రేక్ష‌కులు కూడా పూరీ మంచి సినిమా చేసాడ‌ని చెప్తార‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు.

User Comments