డ్రగ్స్ కేసుపై పూరీ కూతురు రియాక్షన్ ఇది..!

Puri Jagannath Daughter Pavithra Fires Media
టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోన్న డ్రగ్స్ కేసులో స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే పూరీతో సన్నిహితంగా ఉండే కొంతమంది కూడా డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు కలిగి ఉన్నారని న్యూస్ బయటకు రావడంతో.. ఈ మొత్తం వ్యవహారం అంతా ఇప్పుడు పూరీ చుట్టే తిరుగుతుంది. కానీ, ఇంత జరుగుతున్నా పూరీ మాత్రం పెద్దగా రియాక్షన్ ఇవ్వకుండా తన పని తను చేసుకుపోతుండటం విశేషం.
అయితే, ఈలోపు తనపై రకరకాలుగా మీడియాలో ప్రచారాలు జరుగుతుండటంతో.. దిగొచ్చిన పూరీ తాజాగా ట్విట్టర్ లో డ్రగ్స్ అనే పేరునే ప్రస్తావించకుండా.. మీడియాలో చెబుతున్నట్లు తాను ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వలేదని, ప్రస్తుతం సినిమా పనితో బిజీగా ఉన్నానని తన స్టైల్లో ట్వీటేశాడు. దీంతో ఈ వ్యవహారం సస్పెన్స్ డ్రామాగా మారిపోయింది. ఇలాంటి టైమ్ లో ఇప్పుడు ఉన్నట్టుండి పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర రియాక్షన్ బయటకు రావడం విశేషం. తన తండ్రి పేరును మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో ఫీలైన పవిత్ర.. ఈ డ్రగ్స్ కేసు వ్యవహారంపై కొంచెం గట్టిగానే స్పందించింది.
ముందుగా తన తండ్రి పూరీ జగన్నాథ్ ఓ సెలబ్రిటీ కాబట్టి ఇలా ఇష్టం వచ్చినట్లు రూమర్లు రాయడం సరికాదని, ఒక కుటుంబం గల వ్యక్తిగా, ఆయనపై వేలెత్తి చూపించే ముందు, వారి ఫ్యామిలీ గురించి, ఆయన రెప్యుటేషన్ గురించి ఆలోచించాలని క్లాస్ పీకిన పవిత్ర.. పని లేని వాళ్లెవరో తన తండ్రి గురించి చెడ్డగా రాసినంత మాత్రాన అబద్ధం నిజమైపోదని, ఆయన ఎప్పుడూ కొన్ని లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటి కోసమే తపన పడుతుంటారని తర్వాత చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఒక దర్శకుడిగా తన తండ్రి మేథస్సే ఆయన పెట్టుబడి అని, అదే ఆయన భవిష్యత్ కూడా అని, అందుకే అలాంటి అలవాట్లతో కెరీర్ పాడు చేసుకోరని తెలిపింది. చివరగా తన తండ్రిపై విమర్శలు చేస్తున్నవారు నోరు దగ్గర పెట్టుకోవడం మంచిదని కొంచెం గట్టిగానే పేర్కొంది. మొత్తంగా మా నాన్నకు డ్రగ్స్ కు ఎటువంటి సంబంధం లేదని పూరీ కూతురు పవిత్ర తన వెర్షన్ బలంగా వినిపించింది.