త‌మ్ముడు కోసం పూరి ప్ర‌చారం?

Last Updated on by

త‌మ్ముడు కోసం అన్న పూరి ప్ర‌చార బ‌రిలోకి దిగ‌నున్నాడా? వైకాపా అద్య‌క్షుడు జ‌గ‌న్ సైతం పూరి త‌ప్ప‌క రావాల్సిందిగా ఆహ్వానించారా? అంటే అవున‌నే తెలుస్తోంది. పూరి జ‌గ‌న్నాథ్ త‌మ్ముడు ఉమాశంకర్ గ‌ణేష్ న‌ర్సీప‌ట్నం నియోజిక వ‌ర్గం త‌రుపున వైకాపా నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లోనూ వైకాపా నుంచి పోటీ చేసి తృటిలో ఒడిపోయాడు. ఈ నేప‌థ్యంలో ఈసారి క‌చ్చితంగా గ‌ణేష్ గెలుపు కాయ‌మ‌నే ఆయ‌న స‌న్నిహితులు, పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే ఈసారి నేరుగా పూరి జ‌గ‌న్ కూడా త‌మ్ముడు కోసం ప్ర‌చార బ‌రిలో దిగితే మ‌రింత క‌లిసొస్తుంద‌ని జ‌గ‌న్ సూచించ‌డం, స్వ‌యంగా జ‌గ‌న్ పూరికి ఫోన్ చేసి ప్ర‌చారానికి స‌హ‌క‌రించాల్సిందిగా కోరారుట‌.

దీంతో ఆయ‌న మాట కాద‌న‌లేక ప్ర‌చారినికి ఒప్పుకున్నాడుట‌. కేవ‌లం గ‌ణేష్ పోటీ చేసే ప్రాంతంలో మాత్ర‌మే ప్ర‌చారం చేస్తాన‌ని ముందే చెప్పేసాడుట‌. సెల‌బ్రిటీ క‌దాని! అన్ని ఏరియాల్లో ప్ర‌చారం అంటే నా వ‌ల్ల కాదంటూ ముందు చెప్పేసాడుట‌. ఈ విష‌యంలో జ‌గ‌న్ కు రామ్ గోపాల్ వ‌ర్మ కూడా స‌హ‌క‌రించాడుట‌. పూరి వ‌ర్మ‌కి ప్రియ శిష్యుడు. సంద‌ర్భాను సారం పూరి, వ‌ర్మ‌ను ఎంత‌గా విబేధిస్తాడో? అంత‌కు మించి ల‌వ్ ను చూపిస్తాడు. ఇదే అదునుగా భావించిన వ‌ర్మ వైకాపా త‌రుపున ప్ర‌చారం చేస్తే ఇద్ద‌రికీ ప్ల‌స్ అవుతుంద‌ని పూరి చెవిలో వేసాడుట‌. అటు గురువు మాట కాద‌న‌లేడు.ఇటు త‌మ్ముడు గెలుపుకు తోడ్ప‌డాలి. అందుకే పార్టీ అదిష్టానం మాట‌కు క‌ట్టుబ‌డి పూరి ప్ర‌చారానికి ఒప్పుకున్నాడ‌ని తెలుస్తోంది.

Also Read: Dookudu Days Back For Mahesh

User Comments