ఇడియ‌ట్ ని మించేలా పూరి రౌడీ

రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌- పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ లో ఓ సినిమాకు స‌న్నాహాకులు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించారు. పూరి క‌నెక్ట్స్ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. అయితే ఈసినిమా క‌థేంట‌న్న‌ది ఇంకా లీక్ అవ్వ‌లేదు. ఇండియ‌ట్ లా ఉండ‌బోతుంద‌ని లీకులందాయి గానీ! కంటెంట్ పై స‌రైన క్లారిటీ లేదు. తాజాగా పూరి కేవ్ నుంచి ఓ ఆస‌క్తిక‌ర లీకు అందింది. అంతా అనుకుంటున్న‌ది నిజ‌మేన‌ట‌.

ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ యూత్ ని ఆధారంగా చేసుకుని రాసిన క‌థ అట‌. హీరో క్యారెక్ట‌ర్ ఆవారా అట‌. ఇడియ‌ట్ లో ర‌వితేజ క‌న్నా మాస్ గా ఆ పాత్ర‌ను డిజైన్ చేసిన‌ట్లు చెబుతున్నారు. మ‌రో ర‌కంగా చెప్పాలంటే ఇడియ‌ట్ ని మించి చెక్కాడ‌ని అంటున్నారు. వాస్త‌వానికి ఈ క‌థ‌ను కొన్ని సంవ‌త్స‌రాల క్రిత‌మే రాసి పెట్టాడుట‌. కానీ విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్ప‌టి క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని క‌థ‌లో చాలా మార్పులు చేసి క్యారెక్ట‌ర్ ను మ‌రింత బ‌లంగా రాసిన‌ట్లు చెబుతున్నారు. తెలంగాణ భాష ఎక్క‌డా క‌థ‌లో క‌నిపించ‌దుట‌. ఆంధ్రా స్టైల్లోనే సినిమా అంతా ఉంటుంద‌ని అంటున్నారు. వైజాగ్ జ‌గ‌దంబా సెంట‌ర్ ఆవ‌రా చాయ‌లు హీరో పాత్ర‌లో అక్క‌డ‌క్క‌డా క‌నిపిస్తాయ‌ట‌. చూద్దాం ఈ క్రేజీ కాంబినేష‌న్ ఎలా ఉంటుందో. ఇందులో హీరోయిన్ గా జాన్వీ క‌పూర్ పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.