హిట్ అయితే వెద‌వ‌ కూడా జీనియ‌స్

డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. గ‌తంలో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్లు అందించారు. వార‌సుల్ని టాలీవుడ్ కి ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త అయిన సొంతం. అయితే కొన్నేళ్ల‌గా ఆయ‌న సినిమాలు పెద్ద‌గా ఆడ‌లేదు. దీంతో ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు అదే స్థాయిలో వినిపిస్తున్నాయి. వాట‌న్నింటిని చెరుపుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నా చెర‌గ‌డం లేదు. ప్ర‌స్తుతం ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ తో ఇస్మార్ట్ శంక‌ర్ తెర‌కెక్కించారు. ఈనెల 18న సినిమా విడుద‌ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ఇచ్చిన ఇంట‌ర్వూలో స‌క్సెస్ ఫెయిల్యూర్ గురించి ఆస‌క్తిక‌రంగా మాట్లాడారు. ఆ వేంటో ఆయ‌న మాట‌ల్లోనే విందాం.

నా ప్ర‌తీ సినిమాలో కొత్త పాయింట్ ఉండేలా చూసుకుంటాను. కొత్త‌గా ఉండేలా తీయాల‌నుకుంటాను. కాక‌పోతే సినిమా ఆడితే వెధ‌వ కూడా జీనియ‌స్ లా క‌న‌పిస్తాడు. సినిమా ఆడ‌క‌పోతే జీనియ‌స్ కూడా వెధ‌వ అయిపోతాడు. విజ‌యాన్ని బ‌ట్టే త‌ప్పొప్పుల్ని నిర్ణ‌యిస్తారు అని అన్నారు. పూరి-రామ్ సినిమా చేస్తే బాగుంటుంద‌ని మీడియా వాళ్లే ఎక్కువ‌గా ప‌బ్లిసీటీ చేసారు. వాటికోస‌మైనా రామ్ తో సినిమా చేయాల‌ని డిసైడ్ అయ్యా. రామ్ గుడ్ బాయ్ పాత్ర‌లు చూసి నాకు బోర్ కొట్టింది. అందుకే త‌న‌ని బ్యాడ్ బాయ్ గా మార్చేసా. అతనికి బాగా న‌చ్చింది. టాలీవుడ్ కు ఎలాంటి క‌థ‌లు వ‌చ్చినా ప్రేర‌ణ మాత్రం హాలీవుడ్. ఈక‌థ‌ను అక్క‌డ నుంచి స్పూర్తిగా తీసుకుని రాసాన‌ని తెలిపారు. ఇటీవ‌ల కాలంలో న్యూ జోన‌ర్ క‌థ‌లు వ‌స్తున్నాయి. మాస్ సినిమా వ‌చ్చి చాలా రోజులైంది. ఆలోటును ఇస్మార్ట్ శంక‌ర్ తీరుస్తుంది. అలాగే బాల‌య్య‌కు త‌గిన క‌థ రాసుకున్న‌ప్పుడు ఆయ‌న‌తో సినిమా చేస్తా. ఆయ‌న చేయ‌ని జోన‌ర్ లేదు. ఈసారి బాల‌య్య‌ని కొత్త‌గా చూపించాల‌ని అని అన్నారు.